YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

వాసవిక్షేత్రంలో మహా కుంభాభిషేకాలు

వాసవిక్షేత్రంలో మహా కుంభాభిషేకాలు

వాసవిక్షేత్రంలో మహా కుంభాభిషేకాలు
ఏలూరు, మార్చ్ 3 
పశ్చిమగోదావరి జిల్లా వాసవిక్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పునరావర్తన జీర్ణోద్ధరణ అస్టభందన వర్ణ కలాపన మహోన్నత మహాకుంభాభిషేక మహోత్సవములు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కామల క్షేత్రం పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ శ్రీ నగరేశ్వర మహిషాసురమర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహోత్సవంలో భాగంగా మహిళల కోలాటాలతో పురవీధులలో కలశాల ఊరేగింపు నిర్వహించారు . ఈ మహోత్సవంలో భాగంగా కోయంబత్తూర్ నుండి విచ్చేసిన వేద పండితులు ఆలయ ప్రాంగణంలో గల యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణపతి, నవగ్రహ, కాలభైరవ, చండికేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మరియు సోమ కుంభ పూజ, యాత్ర హోమం యాగశాల ప్రవేశం, విశేష మూలమంత్ర ద్రవ్య ఆహుతి తదితర కార్యక్రమాలు విశేషంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ అతిథిగా శ్రీధర్ స్వామిజీ విచ్చేసారు.స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related Posts