YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా టెన్షన్ వద్దు : మోడీ సూచన

కరోనా టెన్షన్ వద్దు : మోడీ సూచన

కరోనా టెన్షన్ వద్దు : మోడీ సూచన
న్యూఢిల్లీ,మార్చి 3
దేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదైన వేళ.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా సోకిన వ్యక్తులు కలిసిన వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా విషయమై భయపడొద్దని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. దేశంలో కరోనా వ్యాపించకుండా అందరం కలిసికట్టుగా నివారిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. స్వీయ రక్షణ కోసం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలని, ఇవెంతో ముఖ్యమైనవన్నారు.కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధ ఎలా ఉందనే విషయమై సమీక్ష నిర్వహించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. దేశంలోకి అడుగుపెట్టే వారికి స్క్రీనింగ్ చేయడం, తగిన వైద్యం అందించడం లాంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3 వేల మందికి పైగా మరణించగా.. 88 వేల మందికిపైగా ఈ వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. భయం వద్దు తగ్గించుకోవచ్చంటున్న సుమకరోనా వైరస్ గురించి భయపాడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. అలాగే ఆ వైరస్ సోకినప్పుడు మనకు కనిపించే లక్షణాలను కూడా చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. మనం మరుగున పడేసిన మన సంస్కృతి, సంప్రదాయ పద్ధతులను మళ్లీ కచ్చితంగా పాటిస్తే ఈ వైరస్ సోకకుండా ఉండే అవకాశం ఉందని చెప్పారు.‘‘ఈ వైరస్‌కు ఉన్న లక్షణాలు ముక్కుకారడం, తుమ్ములు, జ్వరం, గొంతునొప్పి, చాతిలో నొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, రెండు మూడు రోజుల తర్వాత పొడిదగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు. ఇవి ఉంటే కచ్చితంగా వైరస్ సోకిందని కాదు. ఒక వేళ ఈ లక్షణాలు ఉంటే వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. భయపడాల్సింది ఏమీ లేదు’’ అని సుమ వీడియోలో వెల్లడించారు.మన భారతీయ సంస్కృతి విధానంను పాటిస్తే ఎలాంటి వైరస్ మన దగ్గరకు రాదని సుమ అన్నారు. ‘‘మన భారతీయ సంస్కృతి విధానంలో ముందు నుంచే మనం ఎంచక్కా ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం. బయటి నుంచి ఇంటికి వస్తే కాళ్లు చేతులు, మొహం కడుక్కుంటాం. వంటల్లో పసుపు వాడతాం. అన్నీ చక్కగా ఉడకబెడతాం. ఇవన్నీ మళ్లీ ఫాలో అవ్వడం మొదలుపెడదాం. కుదిరితే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి. దీని గురించి భయపడాల్సింది ఏమీ లేదు, కంగారు పడాల్సిందిలేదు. కొంచెం శుభ్రత పాటించడం అంతే’’ అని వీడియోలో సుమ చెప్పుకొచ్చారు.

Related Posts