YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీ లాభాల్లోకి మార్కెట్లు

భారీ లాభాల్లోకి మార్కెట్లు

భారీ లాభాల్లోకి మార్కెట్లు
ముంబై, మార్చి 3
దేశీ స్టాక్ మార్కెట్ నష్టాలకు అడ్డుకట్ట పడింది. గత వారం రోజులుగా పడిపోతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం మాత్రం దుమ్మురేపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ మార్కెట్ పరుగులు పెట్టింది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి.సెన్సెక్స్ 1.3 శాతం లేదా 480 పాయింట్ల లాభంతో 38,624 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 171 పాయింట్లు లేదా 1.5 శాతం లాభంతో 11,303 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లోనే క్లోజయ్యాయి. మెటల్, ఫార్మా సూచీలు ఏకంగా 5 శాతానికి పైగా లాభపడ్డాయి.✺ నిఫ్టీ 50లో వేదాంత, సన్ ఫార్మా, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. వేదాంత ఏకంగా 8 శాతానికి పైగా ర్యాలీ చేసింది. సన్ ఫార్మా కూడా 7 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో నిఫ్టీ 50లో కేవలం ఐటీసీ, యస్ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఐటీసీ దాదాపు 1 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్ సూచీలు 5 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ ఐటీ 2 శాతం పైకి కదిలింది. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ ఒక శాతానికి అటుఇటుగా లాభపడ్డాయి.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. దాదాపు 39 పైసలు నష్టంతో 73.12 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.83 శాతం పెరుగుదలతో 53.36 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.55 శాతం పెరుగుదలతో 48.30 డాలర్లకు ఎగసింది.

Related Posts