*"మనిషిలో పాజిటివ్ థాట్స్ - పెంచే ‘గాయత్రీ మంత్రం"*
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని పండితులు చెబుతారు.
ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుంతించినట్లేనని ఋగ్వేదంలో చెప్పబడింది.
ఒకప్పుడు వేద పాఠశాలలో మాత్రమే ఈ మంత్రాన్ని జపించేవారు.
కానీ ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు.
ఈ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్థిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని తేజోవంతం చేస్తాయి....
ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువురు ప్రయత్నాలు కూడా చేశారు.
ఎలాగైతే ఒక బ్రిడ్జ్ మీద సైనికులంతా నిల్చుని క్రమపద్థతిలో మార్చ్ ఫాస్ట్ చేస్తే వెలువడే ధ్వని తరంగాల ద్వారా ఆ బ్రిడ్జిని కూల్చేయవచ్చో అదే పద్దతిలో ఈ గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపిస్తే మన శరీరం మనకు తెలియకుండానే ఎన్నో వైబ్రేషన్స్‌కి గురవుతుంది...
అంతే కాకుండా మనకు పాజిటివ్ థాట్స్ వస్తాయి...
కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, ఈ అంశంపై పలు విదేశీ విశ్వ విద్యాలయాలు రకరకాల పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
*గాయత్రీ_మంత్రం*
ఓం భూర్భువః సువః తతం సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!
*_శుభమస్తు_*
సమస్త లోకా సుఖినోభవంతు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో