YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 పీపీఎఫ్ తో లక్షలాధికారులు...

 పీపీఎఫ్ తో లక్షలాధికారులు...

 పీపీఎఫ్ తో లక్షలాధికారులు...
ముంబై, మార్చి 4,
కరోనా వైరస్ ప్రధాన కారణం. పైగా ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడదామంటే.. ఆ డబ్బులు కూడా వెళ్లేది స్టాక్ మార్కెట్‌లోకే. మరి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందాలని భావిస్తే.. మాత్రం పోస్టాఫీస్‌కు వెళ్లాలి. అక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఇది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చాలా మంది ఈ స్కీమ్‌లో చేరుతూ ఉంటారు. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. తర్వాత ఈ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తూ రావాలి. పీపీఎఫ్ స్కీమ్‌లో చేరడం వల్ల కచ్చితమైన రాబడి పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు.పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లుగా ఉంది. దీన్ని ఐదేళ్లపాటు పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ మొత్తం వార్షిక ప్రాతిపదికన మీ అకౌంట్‌లో జమవుతూ వస్తుంది.మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేయాలని రెడీ అయ్యారు. అంటే మీరు రోజుకు రూ.333 అదా చేసి నెలకు రూ.10,000 చొప్పున 15 ఏళ్లపాటు పీపీఎఫ్ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దీంతో మీరు ఏడాదికి రూ.1.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇలా మీరు 15 ఏళ్లలో రూ.18 లక్షలు పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి ఏకంగా రూ.34.88 లక్షలు వస్తాయి. అంటే మీ డబ్బుకు రూ.16.88 లక్షల లాభం వస్తుంది.మీరు పీపీఎఫ్ అకౌంట్‌ను 15 ఏళ్ల మెచ్యూరిటీ కాలం తర్వాత మరో ఐదేళ్ల పొడిగించుకున్నారు. అంటే మీరు నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తున్నారు. ఇప్పుడు 20 ఏళ్లలో మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.24 లక్షలు అవుతుంది. ఇప్పుడు 7.9 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీరు మెచ్యూరిటీ కాలం తర్వాత ఏకంగా రూ.58  లక్షలు తీసుకుంటారు. ఇక్కడ మీకు వచ్చే లాభం రూ.34 లక్షలకు పైమాటే.పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కచ్చితమైన రాబడితోపాటు మరో  అదిరిపోయే బెనిఫిట్ కూడా ఉంది. పీపీఎఫ్ అకౌంట్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్ అకౌంట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు, మీ డబ్బుపై వచ్చే వడ్డీ, చివరిలో విత్‌డ్రా చేసుకునే అమౌంట్‌‌పై ఎలాంటి పన్ను ఉండదు. అంటే పూర్తిగా పన్ను  మినహాయింపు లభిస్తుంది.కాగా పీపీఎఫ్ అకౌంట్‌లో గతంలో నెలకు ఒకసారి మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు నెలకు ఒకటి కన్నా ఎక్కువ సార్లు డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీ కాలం తర్వాత కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా అలాగే  కొనసాగించొచ్చు. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదివరకే ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వడ్డీ పొందొచ్చు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌పై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. మోదీ సర్కార్ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అంటే వడ్డీ రేటు పెంచొచ్చు. లేదా తగ్గించొచ్చు. ఇదీకాకపోతే అలాగే స్థిరంగా కొనసాగించొచ్చు. అందువల్ల వడ్డీ రేటు మార్పు ఉంటుందని ముందుగానే తెలుసుకోవాలి. వడ్డీ రేటు మార్పునకు అనుగుణంగా మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు సంవత్సరానికి ఒకసారి మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది.

Related Posts