YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

25 వేలు ఇస్తే రోల్స్ రాయిల్స్ లో  ప్రయాణం

25 వేలు ఇస్తే రోల్స్ రాయిల్స్ లో  ప్రయాణం

25 వేలు ఇస్తే రోల్స్ రాయిల్స్ లో  ప్రయాణం
తిరువనంతపురం, మార్చి 4,
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు భారత రోడ్లపై టాక్సీగా ఉపయోగించబడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఛాన్సే లేదు అంటారా....కానీ ఇది కేరళలో  జరుగుతోంది. కేరళలో ట్యాక్సీ ప్లేట్ తో రోడ్డుపై  ప్రయాణికులను చేరవేస్తూ గోల్డ్ రోల్స్ రాయిస్ క్యాబ్ సేవలు అందిస్తోంది. ఇందేంటి అంత ఖరీదైన రోల్స్  రాయిస్ కార్ క్యాబ్ సర్వీసుకు వాడుతున్నారా అని ముక్కున వేలేసుకోకండి. సిరిష్ చంద్రన్ అనే ట్విట్టర్ యూజర్ టాక్సీ స్టిక్కర్‌తో ఉన్న...పసుపు రంగు నంబర్ ప్లేట్‌ కలిగి ఉన్న  పాత తరం గోల్డెన్ రోల్ రాయిస్ కారు ఫోటోను "ఇది నిజం" అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు. ఇది ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి కారుగా కొందరు గుర్తించారు. ప్రస్తుత తరం రోల్స్ రాయిస్ ఫాంటమ్  కారు భారతదేశంలో రూ .9.5 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర)ఉంది.  కానీ కేరళలోని ఆక్సిజన్ రిసార్టు యజమాని బాబీ చెమ్మనూర్ అనే దీన్ని టాక్సీగా వాడుతున్నాడు. తన రిసార్ట్స్‌లో బసచేసే అతిధుల ప్యాకేజీలో భాగంగా ఈ బంగారు కారు ప్రయాణం ఒక భాగం. ఈ వాహనంలో ప్రయాణించాలనే ప్రజల కలని అతను 25 వేల రూపాయలకు తీరుస్తున్నాడు. 2 రోజుల పాటు రిసార్ట్‌లో వచ్చి బస చేసే వ్యక్తుల కోసం ఈ కారును పిక్-అప్ మరియు డ్రాప్ సేవగా ఉపయోగిస్తున్నారు. చిత్రాన్ని షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయింది. నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. 

Related Posts