వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి తిరుకళ్యాణ మహోత్సవం
పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదాద్రి, మార్చి 4
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి అల్లోల దంపతులకు ఆలయ ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా... అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి అల్లోల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహెందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.