YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

17 నుండి శ్రీ శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర వేడుకలు వేడుకలు. 

17 నుండి శ్రీ శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర వేడుకలు వేడుకలు. 

 

17 నుండి శ్రీ శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర వేడుకలు వేడుకలు. 
నెల్లూరు మార్చి 4
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లోని తూర్పు కనుపూరు లో వెలసిన శ్రీశ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర వేడుకలు ఈ నెల 17 నుండి ఘనంగా నిర్వహించనున్నట్లు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక గూడూరు పట్టణంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, డిఎస్పి భవాని హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 20 వరకు శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు గాంచిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ వేడుకలను కనులారా వీక్షించేందుకు నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ నాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అమ్మవారి భక్తులు తరలి రానున్నారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిల్లకూరు మండలం లోని తూర్పు కనుపూరు, రావుల వారి పాలెం, కొమరా వారి పాలెం ఇతర ప్రాంతాలలో అమ్మవారిని ఊరేగిస్తారు అని చెప్పారు. స్థానిక కుమ్మరి వాళ్లు తయారుచేసిన పోలేరమ్మ విగ్రహము ను అంగరంగ వైభవంగా మేళతాళాలతో రజకులు మోసుకు వచ్చి, స్థానిక గంగ మిట్టమీద ఏర్పాటు చేయబడిన గుడిసెలో అమ్మవారు కొలువు తీర ఉన్నారని తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారిని శాఖంబరి గా అలంకరించి పూజలు చేస్తారు అని పేర్కొన్నారు. ముత్యాలమ్మ జాతర లో భాగంగా గూడూరు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్సై పుల్లారావు, హుస్సేన్ భాష, ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు.
 

Related Posts