YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీలకు ఆర్ధిక తోడ్పాటు

బీసీలకు ఆర్ధిక తోడ్పాటు

బీసీలకు ఆర్ధిక తోడ్పాటు
న్యూ ఢిల్లీ ,మార్చ్ 4 
విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రి  క్రిషన్ పాల్ గుర్జార్   లిఖితపూర్వకంగా నేడు సమాధానము ఇచ్చారు.నేషనల్ బ్యాక్ వర్డ్  క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్  కార్పొరేషన్  కింద ఏ సెక్టార్లు ఆర్థిక స్వావలంబన కి సంబంధించి లబ్ధి పొందడంతోపాటు, ఏయే ప్రాజెక్టుల కింద అందులో అర్హులకు లోన్లను మంజూరు చేస్తున్నారు అని ప్రశ్నించారు.దీనికి స్పందించిన ఆ శాఖ కేంద్ర మంత్రి  క్రిషన్ పాల్ గుర్జార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎన్ బి సి ఎఫ్ డిసి కింద వెనుకబడ్డ తరగతులకు చెంది మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వారికి తోడ్పాటు నిస్తున్నామన్నారు.స్వీయ ఆధారిత ఉద్యోగ కల్పన అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వాల చేత నామినేట్ చేయబడ్డ  చాలెంజింగ్ ఏజెన్సీలు   ద్వారా నడుపబడుతున్న ఆయా విద్యాసంబంధిత అవకాశాలపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. అలాగే  మైక్రో ఫైనాన్స్ స్కీములను పలు రాష్ట్రాల్లో నిర్దేశిత సెక్టార్లలో అమలు చేస్తున్నామని అన్నారు.అగ్రికల్చర్ మరియు అలైడ్ యాక్టివిటీస్ స్మాల్ బిజినెస్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ,ట్రాన్స్ పోర్ట్  సెక్టార్ అలాగే టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు లలో చేరనున్న ఆయా తరగతుల వారికి తోడ్పాటుని అందిస్తున్నామన్నారు. 

Related Posts