అగ్రిగోల్డ్ కార్యాలయాలలో ఈడి సోదాలు
అగ్రిగోల్డ్ స్కాం పై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్ మార్చి 04
అగ్రిగోల్డ్ సంబంధించిన కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఆరువేల కోట్ల రూపాయల వరకు ఖాతాదారుల నుంచి వసూలు చేసిన ఆరోపణలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ స్కాంపై సిఐడీ విచారణ జరిపింది. ఏపీ సి ఐ డి ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. అగ్రిగోల్డ్ ప్రధాన సంస్థతో పాటు డైరెక్టర్లు మేనేజర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి.
మనీలాండరింగ్ తో పాటు హవాలా కు పాల్పడ్డ ఆరోపణలు కుడా నమోదయ్యాయి. ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించి సొంత ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై సోదాలు జరిపినట్లు సమాచారం. బినామీల పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులను అగ్రిగోల్డ్ డైరెక్టర్లు కూడగట్టారని అభియోగాలు నమోదయ్యాయి.