కార్పొరేటు దీటుగా గురుకులాలు
కామారెడ్డి మార్చ్ 04
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మూడవ వార్షికోత్సవానికి మంగళవారం సాయంత్రం ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనసభ అధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు తిలకించారు. అనంతరం సభాపతి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద వర్గాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ గురుకుల పాఠశాలలో చదువుకోవాలని గురుకుల పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉంటాయని అన్ని రంగాల్లో చదువు ఒక్కటే కాకుండా ఆటపాటల్లో ఈ పాఠశాలలో చదివారు ఉంటారని అదే లక్ష్యమని దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంకణబద్ధులై ఉన్నారని అన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లో విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయి కి వెళ్ళడం అభినందనీయమన్నారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వసంత్ రెడ్డి, ఆర్ సి ఓ తిరుపతి, కన్వీనర్ సత్య నాథ్ రెడ్డి, ఎంపీపీ రఘు, జెడ్పిటిసి స్వరూపా, సర్పంచ్ స్వప్న, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్, ఎంపీటీసీ సందీప్, కో ఆప్షన్ ఆరిఫ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.