YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలి జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్

కరోనా వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలి జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్

కరోనా వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలి
జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్
జగిత్యాల మార్చి 04
కరోనా (కొవిడ్ - 19) వ్యాధి పట్ల జిల్లా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్   తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా కొత్త వ్యాధి చైనా దేశంలో ప్రబలి ఇతర  దేశాలకు కూడా వ్యాపించిందని. గల్ఫ్ దేశాల నుండి వచ్చే జిల్లాకు చెందిన ప్రజలను
విమానాశ్రయంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన కూడా ఏమాత్రం  ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. కొవిడ్ - 19 పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదైన దృష్ట్యా  రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా రక్షణ చర్యలు చేపట్టిందని  తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు  వైద్య ఆరోగ్య  శాఖ మాత్యులు ఈటెల రాజేందర్  ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వ్యాధి నివారణకు పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ - 19 వ్యాధి రాకుండా  ముందు జాగ్రత్త ప్రజలు మాస్కులు ధరించడం మంచిదని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఐస్ క్రీమ్ లాంటి చల్లని వస్తువులకు దూరంగా ఉండాలని , వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ శుభ్రమైన బట్టలు ధరించాలని ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ఉండాలని తెలిపారు.అలాగే చైనా మరియు ఇతర ప్రభావిత దేశాల నుండి తిరిగి వచ్చిన ప్రయాణికులతో లేదా కరోనా వైరస్ బారిన పడినట్లు అనుమానం ఉన్న ఏ వ్యక్తితోనైనా సన్నిహితంగా మెలిగి ఉంటే 
ఈ ముఖ్యమైన సూచనలు పాటించాలని తెలిపారు.
1.రెండు వారాల వరకు ఎవరిని కలవకూడదని, ఒక ప్రత్యేక గదిలో నిద్రించాలి
2.దగ్గినప్పుడు,  తుమ్మినప్పుడు చేతి రుమాలు తప్పనిసరిగా అడ్డు పెట్టుకోవాలి
3.సబ్బుతో మీ చేతులను తరచూ కడుక్కోండి
4.దగ్గు జ్వరంతో బాధ పడుతున్న వారితో దూరంగా ఉండండి
సురక్షితంగా ఉండండి కరోనా వైరస్ నుండి సంరక్షించుకోండి. ఇందుకుకు అవగాహనతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని  తెలిపారు.  అలాగే పై లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారిని కూడా అనుమానితులుగా భావించి వారి పూర్తి వివరాలు సేకరించి తగు  జాగ్రత్తలు వహిస్తూ వెంటనే జిల్లా వైద్యఅధికారి కార్యాలయానికి తెలుపవలసిందిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ తెలిపారు .

Related Posts