YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీకి క్యూ కడుతున్న కరోనా బాధితులు

గాంధీకి క్యూ కడుతున్న కరోనా బాధితులు

గాంధీకి క్యూ కడుతున్న కరోనా బాధితులు
హైద్రాబాద్, మార్చి 4
హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి అనుమానితుల తాకిడి పెరుగుతోంది. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో మొత్తం 47 మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 45 మందికి కరోనా నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) బుధవారం ఓ ప్రకటన  విడుదల చేశారు. మరో ఇద్దరిపై అనుమానం ఉందని, అందువల్ల వీరి రక్త నమూనాల పరీక్షలను పుణె పంపామని తెలిపారు. వారి ఫలితాలు రావాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల కరోనా నిర్ధారణ ఫలితాలు గురువారం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.కరోనా వైరస్ బారిన పడ్డారని  భావిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన వారు కాగా, మరొకరు.. కరోనా పాజిటివ్ కేసుగా గాంధీలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్  యువకుడికి సన్నిహితుడిగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందుకే వీరి ఆరోగ్య పరిస్థితిపై అనుమానంతో వీరి నమూనాలను పుణెకు పంపినట్లుగా వైద్యులు తెలిపారు. వీరి ఫలితాలు వచ్చాక తదుపతి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. డిశ్చార్జి చేసిన 45 మందిని జనసంచారానికి దూరంగా హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లుగా వెల్లడించారు.బుధవారం మరో 23 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వారి రక్త  నమూనాలు కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే, పరీక్షల్లో నెగటివ్‌గా తేలిన వారిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి  చేస్తున్నారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ అవసరమైన కనీస వస్తువులను (బ్రష్‌లు, దుస్తులు వంటివి) ఆస్పత్రి సిబ్బందే వారికి సరఫరా చేస్తున్నారు. మరోవైపు, కరోనా అనుమానితులు గాంధీకి క్యూ కడుతున్న నేపథ్యంలో సాధారణ పేషంట్ల తాకిడి గాంధీకి తగ్గింది.నిండిపోయిన కరోనా వార్డు కరోనా అనుమానితుల తాకిడి నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డు నిండిపోయింది. ఇక్కడి సామర్థ్యానికి మించి కరోనా అనుమానిత కేసులు వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఐసోలేషన్‌ వార్డులో 40 పడకలు మాత్రమే ఉండగా.. 40 గంటల వ్యవధిలో గాంధీకి 50 మంది పరీక్షల కోసం  వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పడకల కొరత తలెత్తింది. దీంతో పెయిడ్ రూమ్స్‌ను సైతం ఐసోలేషన్‌కి వాడుతున్నారు 

Related Posts