YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రులకు జగన్ వార్నింగ్

మంత్రులకు జగన్ వార్నింగ్

మంత్రులకు జగన్ వార్నింగ్
విజయవాడ, మార్చి 4
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత సీఎం జగన్.. మంత్రులకు పలు కీలక  సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారట. ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇంఛార్జ్, జిల్లా మంత్రులదేనని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారట. కొన్ని జిల్లాల్లోగ్రూప్ తగాదాలు ఉండటంతో వాటిపైనా ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారట. అవసరమైన చోట్ల నాయకుల్ని పిలిచి మాట్లాడాలని.. సమన్వయంతో అందరూ కలిసి సమిష్టిగా ముందుకు సాగేలా చూడాలన్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి.. లోకల్ లీడర్స్ మధ్య ఏవైనా విభేదాలు ఉంటే వాటిని సరిదిద్దాలన్నారట. అంతేకాదు మంత్రుల పనితీరుపై తన దగ్గర రిపోర్టులు ఉన్నాయన్నారట. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించారు.. ఒకవేళ మంత్రుల సొంత నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఓడితే పదవులు ఊడతాయని హెచ్చరించారట. అధికార పార్టీ ఎమ్మెల్యేల పని తీరు సరిగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ఈ నెల 8 వరకు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని సూచించారట. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే పూర్తి సన్నద్ధతతో ఎన్నికల రంగంలోకి దిగాలన్నారట.స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్క మద్యం, ఒక్క రూపాయి పంచిన జైలుకు వెళ్లాల్సిందేనన్నారట సీఎం. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కట్టడి చేసే విషయంలోఅధికార పార్టీ నేతలనూ ఉపేక్షించేది  లేదని చెప్పేసారట. మద్యం, డబ్బుకు అవకాశమే ఉండకూడదన్నారట. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు వెలువడే సూచనలు ఉన్నాయని.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని సంకేతాలు ఇచ్చారట. 50శాతానికి కుదిస్తూ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు వరుసగా వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతల్ని యాక్టివ్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఓ విధంగా ఈ 10 నెలల వైఎస్సార్‌సీపీ పాలనకు ప్రజలు ఇచ్చే మార్కులుగా భావించాల్సి ఉంటుంది. అందుకే జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే  కొన్నిచోట్ల గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.నెల రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికానుండటంతో ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే అధికార పార్టీ అప్రమత్తమవుతోంది.. కేడర్‌ను ముందుగానే సమాయత్తం చేస్తోంది. ఇటు టీడీపీ కూడా ప్రజా చైతన్య యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేతల్ని రంగంలోకి దించింది. గ్రామాల్లో, వార్డుల్లో తిరుగుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా తమ కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది.

Related Posts