YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వ్యభిచార గృహాల్లో జబర్దస్త్ కమెడియన్లు 

వ్యభిచార గృహాల్లో జబర్దస్త్ కమెడియన్లు 

వ్యభిచార గృహాల్లో జబర్దస్త్ కమెడియన్లు 
విజయనగరం, మార్చి 4
జబర్దస్త్ దొరబాబు ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి రసికుడ్నే అని నిరూపితం చేశాడు. పలు బీగ్రేడ్ సినిమాల్లో, బ్లూ ఫిల్మ్స్‌లో నటించిన  దొరబాబు జబర్దస్త్‌లో కమెడియన్‌గా నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతను విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఒకమహిళతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తనను వదిలేయాలని పోలీసుల కాళ్లుపట్టుకుంటున్నాడు.ఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఓ మహిళతో పాటూ నలుగురు విటుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు ఉండటంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం దొరబాబుని 
పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే దొరబాబుతో పాటు హైపర్ ఆది టీంలో చేస్తున్న పరదేశి కూడా ఉండటం విశేషం. అయితే వీళ్లు తమను అరెస్ట్ చేయవద్దని పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ హైపర్ ఆది టీంలో చేస్తుండటంతో షాక్‌లో ఉంది జబర్దస్త్ యూనిట్.తూర్పుగోదావరి జిల్లా తొండంగికి చెందిన దొరబాబు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ మొదలుపెట్టిన దొరబాబు.. బీగ్రేడ్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. ఆ తరువాత జబర్దస్త్‌లోకి రావడంతో మనోడు క్రేజ్ పెరిగింది. జబర్దస్త్‌లో సుమారు ఐదేళ్లుగా పనిచేస్తున్న దొరబాబు.. హైపర్ ఆది టీంలో కీలక సభ్యుడు అయ్యాడు.జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించిన దొరబాబు.. 2018లో ఓ యాంకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెల్లూరు  పట్టణంలోని ఓ లోకల్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె టిక్ టాక్‌ వీడియోలలతో పాపులర్ అయ్యింది. కాగా దొరబాబు నందినిల వివాహానికి జబర్దస్త్ కళాకారులు హైపర్ ఆది, రైజింగ్ రాజు, గణపతి, అప్పారావు, వినోదిని తదితరులు అప్పట్లో హాజరయ్యారు. దొరబాబు తన భార్యతో కలిసి చేస్తున్న టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి.దొరబాబు అంతకు ముందు బీ గ్రేడ్ సినిమాలలో నటించినప్పటికీ జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఆది స్కిట్‌లలో చాలా వరకూ దొరబాబు నిజజీవితంలో చేసిన పాత్రలపై పంచ్‌లు పేలుస్తుంటాడు. మనోడు మంచి రసికుడు అని.. యూట్యూబ్‌లో దొరబాబు అని కొడితే మనోడి చరిత్ర మొత్తం వచ్చేస్తుందంటూ హైపర్ ఆది ప్రతి స్కిట్‌లోనూ పంచ్‌లు వేస్తూనే ఉంటాడు. అయితే విశాఖ వ్యభిచార గృహంలో దొరబాబు పట్టుబడటంతో ఆది వేసే పంచ్‌లు ఆన్ స్క్రీన్‌కే కాదు.. ఆఫ్ స్క్రీన్‌కి సంబంధించి కూడా అని సోషల్ మీడియాలో కొంత మంది పంచ్‌లు పేల్చుతున్నారు.ఆది స్కిట్‌లో దొరబాబుతో పాటు చేస్తున్న కమెడియన్ పరదేశి రెడ్ హ్యాండెడ్‌గా వ్యభిచార గృహంలో దొరికేయడంతో.. తమను వదిలేయని దండాలు పెడుతూ పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నాడు.  తప్పైపోయిందని.. మీడియాకు లీక్ చేస్తే.. తమ పరువుపోతుందని ప్రాధేయపడుతున్నాడు పరదేశి. ఆ పక్కనే దొరబాబు సైతం ముఖానికి చేతులు అడ్డం  పెట్టుకుని వదిలేయమని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాడు.దిలా ఉంటే జబర్దస్త్ షో కమెడియన్స్ వ్యభిచార గృహంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరకేయడంతో ఆదిపై పంచ్‌‌లు పేలుతున్నాయి. ఎప్పుడూ జబర్దస్త్‌లో కనిపించేవి ఇవే కదా.. జబర్దస్త్ స్టేజ్‌పై చేసేదే ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా దొరబాబు ఓ అపార్ట్‌మెంట్‌లో చేశాడు.. ఆది రాసే స్కిట్‌లతో ఎప్పుడూ దొరబాబు పక్కింటామెతో ఎఫైర్లు పెట్టుకోవడం, ఆమెకు లైన్ వేయడం.. పెళ్లానికి తెలియకుండా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం లాంటివే కదా రాసేవి చూపించేవి. అపుడెపుడో దొరబాబు యూట్యూబ్ సెక్స్ సినిమాల్లో నటిస్తే వాటిని బేస్ చేసుకుని పంచ్‌లు  రాసి స్కిట్‌లు కొట్టే ఆది.. ఈ ఇష్యూని కూడా క్యాష్ చేసుకుంటాడంటూ పంచ్‌లు పేలుస్తున్నారు.

Related Posts