Highlights
- మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయి
- తప్పు నేనే చేసినట్టు నిందలు
- వేస్తున్న మీడియా హసీన్
తన భర్త, క్రికెటర్ మహమ్మద్ షమీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన భార్య హసీన్ స్పష్టం చేశారు. అతను తనను లైంగికంగా వేధించాడని, హత్యాయత్నం కూడా చేశాడనటానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. షమీ దుర్మార్గుడేనని, తన ప్రాణాలు పోయినా ఇదే మాట చెబుతానని హసీన్ వ్యాఖ్యానించారు. తాజాగా తన భర్తపై ఆరోపణలు చేసిన ఆమె, కొన్ని మీడియా సంస్థలు షమీకి అనుకూలంగా వార్తలు రాస్తున్నాయని, తానే తప్పు చేసినట్టు నిందలు వేస్తున్నాయని అన్నారు.తన వద్ద ఉన్న మరిన్ని సాక్ష్యాలను విడుదల చేస్తానంటూ హెచ్చరిచారు. షమీపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అంశాన్ని సైతం హసీన్ ప్రస్తావించడం గమనార్హం.