YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

 రోనాకు కౌంటర్: భారత రసమ్ పౌడర్‌కు చైనా గిరాకీ 

 రోనాకు కౌంటర్: భారత రసమ్ పౌడర్‌కు చైనా గిరాకీ 

 రోనాకు కౌంటర్: భారత రసమ్ పౌడర్‌కు చైనా గిరాకీ 

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరిది. దీన్ని నివారించే వ్యాక్సీన్ ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. ఈ ఏడాది చివరికి వ్యాక్సీన్ సిద్ధం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక కరోనా దెబ్బకు యూరప్ దేశాల్లో ఎంతో కాలంగా వస్తున్న పలకరింపుల సంప్రదాయాలకు ఫుల్‌స్టాప్ పడింది. ఆప్తులు, స్నేహితుల మధ్య కరచాలనాలు, ఆలింగనాలు, చెక్కిలి ముద్దులు మాయమయ్యాయి. సరైన మందులు దొరికే వరకూ ముందు జాగ్రత్తలే దిక్కు కాబట్టి ప్రజలు వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దేవుడిపై భారమేసి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతులూ, సంప్రదాయాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా.. భారతీయుల సంప్రదాయమైన నమస్కారాలతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సూచనలు చైనా దాకా పాకిపోయాయో ఏమో కానీ.. చైనా కూడా భారత సంప్రదాయాలవైపే మొగ్గు చూపుతోందని నెటిజన్లు తెగ లొల్లి చేస్తున్నారు. ఈ వాదనకు ఆధారంగా ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు.ఆ ఫోటో.. చైనాలోని ఓ రెస్టారెంట్ ఎదుట పెట్టిన బోర్డుకు సంబంధించింది. భారతీయులు 5000 ఏళ్లుగా తింటున్న వంటకం తమ రెస్టారెంట్లో లభిస్తుందని, కరోనాకు చెక్ పెట్టేందుకు ఇది చక్కని ఔషధమని సదరు రెస్టారెంట్ ప్రచారం చేసుకుంటోంది. ఇంతటి ఈ పురాతన ఔషధం.. ఏదో ఆయుర్వేద తాళపత్ర గ్రంధాల్లో వెతికి పట్టుకున్నదేమీ కాదు. మనం రోజూ తినే రసమ్ పౌడరే. దీన్నే చైనా వాళ్లు సర్వరోగ నివారిణిగా, కరోనా పనిపట్టే దివ్యౌషధంగా భావిస్తున్నారని నెటిజన్లు చెప్తున్నారు. అన్ని రకాల వైరస్‌ల నుంచీ రసమ్ పౌడర్ రక్షింస్తుందని చైనీయులు నమ్ముతున్నారని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది.  రసమ్ ఒక్కటే కాదు.. పసుపు కూడా మాదగ్గర లభిస్తోందంటూ సదరు రెస్టారెంట్ వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు.. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపాయి. ఏది ఏమైనప్పటికీ.. కరోనా వైరస్ కారణంగా భారతీయ సంప్రదాయాలు, పద్ధతుల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతున్న మాట మాత్రం వాస్తవం.

Related Posts