శుభోదయం
విలువలేని చోటికి వెళ్లి అవమానపడే కన్నా...
ఒంటరిగా ఉండటమే ఉత్తమం.
ప్రపంచం అలలా ఎగసి పడితే...
నువ్వు ఉప్పెనలా ముంచెత్తు.
ఓటమి గడప తొక్కినా...
గెలుపు తలుపు బట్టలు కొట్టు.
పని ఏదైనా సరే మొదలు పెట్టావంటే...
ముగింపు కూడా తెలిసుండాలి.
ఎప్పుడూ నవ్వుతూ ఉండు...
అది ఎలా ఉండాలంటే...
నీ బాధలకే విసుగొచ్చి...
ఛీ! వీడు మనకు సెట్ అవ్వడు అని నీ నుంచి పారిపోయేలా.
నీకు ఏదీ లేదని ఇతరులతో పోల్చుకోకు...
నీలో సమస్తము ఉన్నాయి...
అశాశ్వతమైనవి నీకెందుకు???
శాశ్వతమైన ఆనందం నీలో ఉంటే చాలు.
ఒక క్షణంలో ఆస్వాదించే ఆనందం ఏదైనా ఉంటే...
దానిని శాశ్వతంగా ఉండేలా చూసుకో...
ఎందుకంటే...
సంతృప్తే సకల సంపదలు నీకు...
కుక్కకి తోకకి ఒకటే వంకర...
కానీ విశ్వాసంలో దానిని మించింది మరొకటి లేదు.
మనిషికి బుద్ధి వంకర...
నమ్మిన వారిని ముంచడంలో వారికి మించిన వారు లోకంలో వేరొకరు లేరు.
కుక్క తోక వంకర కాకుండా చూడొచ్చు గాని...
మనిషి బుద్ధి వంకరను మాత్రమే సరి చేయలేము.
జై శ్రీ కృష్ణా...
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో