YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అనధికార లేఔట్లపై కొరడా

అనధికార లేఔట్లపై కొరడా

అనధికార లేఔట్లపై కొరడా
మెదక్, మార్చి 5
అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అక్రమ లేఅవుట్లలో కొన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని మున్సిపల్‌ కమిషనర్లు రాసిన లేఖలు ఆయా సబ్‌రిజిస్ట్రార్లకు అందడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో రియల్‌ వ్యాపారుల్లో వణుకు మొదలుకాగా, ప్లాట్లు కొన్న వారిలో  అయోమయం నెలకొన్నది. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో కొంతకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారం రియల్‌ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు. లేఅవుట్‌ అప్రూవల్‌, నాలా కన్వర్షన్‌ లేకుండా స్థలాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి మున్సిపాలిటీ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతుంది. పైగా సామాజిక అవసరాలకు భూమి వదలకుండా స్థలాలు విక్రయిస్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నూతన పురపాలక చట్టం ప్రకారం అక్రమ వెంచర్లు ఎన్ని ? ఎన్ని ఎకరాల్లో చేశారన్న దానిపై  అధికారులు వివరాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు సబ్‌రిజిస్ట్రార్లు అందజేస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో అక్రమ లేఅవుట్లకు చెక్‌ పెట్టారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు లేఖలు పంపారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఓ వైపు పట్టణాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా క్రయ, విక్రయాలు పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిని అరికట్టడానికి  ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో వీటిని గుర్తిస్తున్నారు.జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో కొంత కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిగా వెంచర్లు చేస్తున్నారు. లేఅవుట్‌ అప్రూవల్‌, నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లను ప్రజలకు  అంటగడుతున్నారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. అనుమతులు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో వెంచర్లు  చేయడంతో ప్రతి మున్సిపాలిటీ లక్షల్లో ఆదాయం కోల్పోతున్నది. ప్రతి లేఅవుట్‌లో 10శాతం మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు ఆట స్థలం కేటాయించాలి. ఇవేవి లేకుండానే వెంచర్లు చేస్తున్నారు. కనీసం మురికినీటి కాలువలు, సామాజిక అవసరాలకు స్థలాలను విడిచిపెట్టడం లేదు. అనుమతులు లేని ప్లాట్లను కొనడంతో సమస్యలు వస్తున్నాయి. ఎక్కడికక్కడనే స్థలాలను విభజించి అమ్మడం, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించడం పరిపాటిగా మారింది. దీంతో అక్రమ వెంచర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అన్నింటా కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం జరుగాలని ఆదేశించింది. దీంతో ఏయే మున్సిపాలిటీల్లో ఎన్ని అక్రమ  వెంచర్లున్నాయి? ఎన్ని ఎకరాలలో ఉన్నాయి? అనే వివరాలు సేకరించే పనిలో అధికారులున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వెంచర్లను తొలగిస్తున్నారు. అనుమతులు లేని వాటిలో చేపట్టిన నిర్మాణాలను కూలగొడుతున్నారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 187.34 ఎకరాల్లో 37, గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌ పరిధిలో 140 ఎకరాల్లో 22, చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 18, దుబ్బాక పరిధిలో 9.2 ఎకరాల్లో ఒకటి, హుస్నాబాద్‌లో 3 అక్రమ  లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కమిషనర్లు ఆదేశించారు. వాస్తవంగా హుస్నాబాద్‌, దుబ్బాకలో అక్రమ  లేఅవుట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ స్థానిక అధికారులు వాటిని గుర్తించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హుస్నాబాద్‌లో పెద్ద మొత్తంలో వెంచర్లున్నాయి. ఇప్పటి వరకు వాటి లెక్కల తీయలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది.

Related Posts