మాస్క్ లకు భారీగా డిమాండ్
హైద్రాబాద్, మార్చి 5
కరోనా వైరస్ తెలంగాణకు విస్తరించడంతో ఫేస్ మాస్క్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది తెలంగాణకు విస్తరించడంతో ఫేస్ మాస్క్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో మాస్క్‌ల కొరత ఏర్పడింది. కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త కోసం సాధారణ ప్రజలు కూడా మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు. కేవలం రూపాయి రెండు రూపాయాలకు అమ్మాల్సిన రెండు లేయర్ల మాస్కును 20 రూపాయాలకు పైనే విక్రయిస్తున్నారు. ఇక 30 నుంచి 50 రూపాయాలకు అమ్మే ఎన్-95 మాస్క్‌లను మూడు వందలకు పైగా అమ్ముతున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము పెట్టి కొనుగోలు చేస్తున్నారు జనం. కరోనా దెబ్బకు మాస్క్ ధరలు ఆకాశంలో ఉంటే చికెన్ ధరలు మాత్రం పాతాళంలోకి పడిపోయాయి. మాస్కులు గాలి పీల్చినప్పుడు వైరస్ ముక్కులోకి, నోటిలోకి వెళ్లకుండా ఆపగలదు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలను విపరీతంగాపెంచేశారు. వైరస్ ప్రభావం ఇప్పుడే మొదలు కావడంతో ఎన్95 మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందినప్పుడు కూడా ఎన్95 మాస్క్‌లకు ఇంతగా డిమాండ్ లేదని ఇప్పుడు వైరస్ దెబ్బకు ఈ మాస్క్‌లకు రెక్కలు వచ్చాయి. కొన్ని రెట్లను పెంచేందుకు నో స్టాక్ బోర్డులను పెట్టేస్తున్నారు. మాస్కులకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా వ్యాపారులు మాత్రం దోపిడికి పాల్పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్సత్రుల దగ్గర కూడా మాస్కులకు గిరాకి ఏర్పడింది. జనరిక్ ఔషద దుకాణంలో సాధారణ మాస్కులను అధిక రేటుకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్ వ్యాపారులే కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. నిలువుదోపిడికి దిగుతున్న వారిపై కన్నేయాలని అటు అధికారులు ఇటు సర్కార్‌ను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నార్మల్ వ్యక్తులు మాస్క్‌లు పెట్టుకోవాల్సినవసరం లేదని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.