YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 మహిళను ట్రాప్ చేసిన ఆటోవాలా..  దిశ యాప్‌తో ఆటకట్టు.. ఎలా అంటే!

 మహిళను ట్రాప్ చేసిన ఆటోవాలా..  దిశ యాప్‌తో ఆటకట్టు.. ఎలా అంటే!

 మహిళను ట్రాప్ చేసిన ఆటోవాలా..
 దిశ యాప్‌తో ఆటకట్టు.. ఎలా అంటే!
విజయవాడ, మార్చి 5
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచింది. తాజాగా ఈ యాప్ ద్వారా కృష్ణా జిల్లాలో ఓ మహిళ సాయం పొందారు. కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై ఆమెకు అనుమానం రావడంతో.. వెంటనే అప్రమత్తమైంది.మహిళ వెంటనే దిశ యాప్‌ సాయంతో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం పంపారు. వెంటనే సమీపంలోని పీఎస్‌కు అలర్ట్ వెళ్లింది. ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. మహిళను కాపాడారు. ఆటో డ్రైవర్ పెద్దిరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కిడ్నాప్‌ చేసేందుకు ఎందుకు ప్రయత్నించాడో ఆరా తీస్తున్నారు.ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి కేసు నమోదైంది. ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఓ పోకిరీ వేధించాడు. ఆమె విశాఖ నుంచి విజయవాడ వస్తుండగా బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె దిశ ఎస్వోఎస్  ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందగా.. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా యాప్ ద్వారా మహిళలు సాయం పొందుతున్నారు.

Related Posts