YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికే భూకబ్జా కేసులా?

 రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికే భూకబ్జా కేసులా?

 రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికే భూకబ్జా కేసులా?
హైదరాబాద్ మార్చ్ 5
ఫైర్ బ్రాండ్ గా తెలంగాణ రాజకీయాల్లో ముద్రపడిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చిక్కులు వచ్చి పడ్డాయి. పట్టణ గోస కార్యక్రమంతో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృంతగా పర్యటిస్తున్న సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి అతడి భూకబ్జాలు బహిర్గతం చేయించింది. రేవంత్ రెడ్డి భూఆక్రమణల చేశాడని రెవెన్యూ అధికారులే ప్రకటించారు. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నాళ్లుగా ఆశిస్తున్న.. వేచి చూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవికి అనర్హుడయ్యే అవకాశం ఉంది. ఆ పదవికి ఇక దూరమైనట్టేనని పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్నం గోస అంటూ తన నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతుంటే పార్టీ నాయకులు పట్టించుకోలేదు. కనీసం సంఘీభావం తెలపలేదు. ఇప్పుడు భూదందా ఆరోపణలు వస్తుంటే పార్టీలోని పెద్దలు ఎవరూ స్పందించలేదు. కనీసం ఖండించి ప్రభుత్వం కక్షపూరితంగా రేవంత్ రెడ్డి పై కేసులు బనాయిస్తోందని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి పై పార్టీలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పార్టీ అధిష్టానమే శిరోధార్యంగా భావిస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. పార్టీ అనుమతులు తీసుకోకుండా తన సొంతంగా కార్యాచరణ రూపొందించుకుని వెళ్తున్నారు. దీనికి తోడు పార్టీలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా నాయకులతో పొసగడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంగీకరిస్తూనే పీసీసీ అధ్యక్షుడిగా తాను కూడా ఉన్నానని పలుమార్లు ప్రకటించాడు.రేవంత్ రెడ్డి రాకను మొదటి నుంచి కొమటిరెడ్డి సోదరులు వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ రేసులో తమకు పోటీగా వస్తుండడంతో రేవంత్ రెడ్డిపై వారిద్దరూ గుర్రుగా ఉన్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన మద్దతుదారుడిని ప్రకటిస్తానని చెప్పినప్పుడే విబేధాలు తార స్థాయికి చేరాయి. నీవెవరు? మా జిల్లాలో రావడానికి అని బహిరంగంగా ప్రశ్నించారు. ఇక అప్పటి నుంచి మొదలైంది. ఇప్పుడు భూదందా ఆరోపణలు వాస్తవాలు కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. ఇంతకు ముందే ఓటుకు నోట్లు కేసు ఉండగా ఇప్పుడు భూ ఆక్రమణలు తోడవడంతో అలాంటి నేర చరితుడికి ఎలా అధ్యక్ష పదవి ఇస్తారని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Related Posts