YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

బెల్టు షాపులు వుండకూడదు

బెల్టు షాపులు వుండకూడదు

బెల్టు షాపులు వుండకూడదు
అమరావతి మార్చ్ 5
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ సమీక్ష జరిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, ప్రొహిబిషన్–ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ  సమీక్ష భేటీలో  పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు  భరోసాకేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లు , ఇంగ్లిషుమీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నాం. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టుషాపులు నడవకూడదు.  అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని అన్నారు. ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలని అదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదు. గ్రామాల్లో 11వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారు.  వీరిని శక్తివంతంగా వాడుకోవాలి. వారందరికీ ఫోన్లు ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలని అన్నారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి. అలాగే మహిళా మిత్రలు కూడా ఉన్నారు. వీరిని కూడా సమర్థవంతంగా వాడుకోవాలని అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలంటూ సీఎం ఆదేశించారు. ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనులకోసం వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంతో కలిసి కట్టుగా వీరు పనిచేసి ఫలితాలు సాధించాలన్న సీఎం అన్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజరు ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. 

Related Posts