YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గింపు

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గింపు

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ మార్చ్ 5 
 ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదాులకు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ చేదు వార్త వినిపించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.65 ఉండేది. ఈపీఎఫ్ ఖాతాదారులు దాదాపు 6 కోట్ల మంది ఉన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.సమావేశం అనంతరం సంతోష్ గంగ్వార్ విలేకర్లతో మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్ఓ నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ పథకాలు, పోస్టాఫీస్ పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈపీఎఫ్ వడ్డీ రేటును కూడా నిర్ణయించాలని కార్మిక శాఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరుతోంది. దీనికి అనుగుణంగానే ఈ వడ్డీ రేటు తగ్గుతోంది. 2015-16లో 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటు ఉండేది. 

Related Posts