YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శబరిమలలో స్తీల ప్రవేశంపై విచారణ తర్వాతే సిఏఏ వ్యతిరేకవ పిటీషన్లు  స్పస్టం చేసిన సుప్రీం కోర్టు

శబరిమలలో స్తీల ప్రవేశంపై విచారణ తర్వాతే సిఏఏ వ్యతిరేకవ పిటీషన్లు  స్పస్టం చేసిన సుప్రీం కోర్టు

శబరిమలలో స్తీల ప్రవేశంపై విచారణ తర్వాతే సిఏఏ వ్యతిరేకవ పిటీషన్లు
              స్పస్టం చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ మార్చ్ 5
 సిఏఏ చట్ట రాజ్యంగ పరిధిని సుప్రీం కోర్టులో విచారణ ఎప్పుడు జరుగుతుందో  ఇప్పటికి ఓ స్పష్టత వచ్చింది. సిఏఏకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వందల సంఖ్యలో పిటీషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే శబరిమలలో స్తీల ప్రవేశంపై రివ్యూ పిటిషన్ విచారణ పూర్తయిన తర్వాతే సిఏఏ వ్యతిరేకవ పిటీషన్లు విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.సుప్రీం కోర్టులో  గురువారం సిఏఏ చట్టంపై రాజ్యాంగ వివరణని మరో రెండు రోజుల్లో సమర్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కెకె వేణుగోపాల్ చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతనలోని బెంచ్ ఈ పిటీషన్లని విచారణ చేస్తోంది. సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు జరుగుతున్న కారణంగా ఈ పిటీషన్లపై వెంటనే విచారణ మొదలు పెట్టాలని పిటీషన్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కానీ శబరిమల విచారణ పూర్తి కాగానే సిఏఏ వ్యతిరేక పిటీషన్ల విచారణ మొదలవుతుందని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే అన్నారు. 

Related Posts