పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన పోలీసులు
అసిఫాబాద్ మార్చ్ 5
కోమరం భీమ్ జిల్లాలోని రెబ్బెన మండల నంబాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పదవతరగతి విద్యార్థిని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా సామగ్రిని పంపిణీ చేసిన జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై వి ఎస్ సుధీంద్ర,ఈ సందర్బంగా మాట్లాడుతూ పబ్లిక్ పోటీ పరీక్షలకు విద్యార్థినివిద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని అప్పుడే మంచి మార్కులను సాదించగల్గుతారని..భావిభారత పౌరులు విద్యతోనే విజ్ఞానం,సామాజిక స్పృహ,ఆధునిక పరిజ్ఞానం పెంపొందించుకోగల్గుతారని అన్నారు.అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన, హక్కుల పై అవగాహన కల్గివుండలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, మండల సబ్ ఇన్స్పెక్టర్ దీ కొండరమేష్,విద్యాశాఖఅధికారి వెంకటస్వామి,జెడ్పిటిసి సంతోష్,గ్రామ సర్పంచ్,సోమశేకర్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినివిద్యార్థులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.