కరోనా కు ముందస్తు నివారణోపాయం ఆర్సినిక్ ఆల్బమ్ - 30 ఉత్తమం
ఎమ్మిగనూరు మార్చ్ 05
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ ఆయుష్ వైద్యులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వయునాని వైద్య లు డాక్టర్ రజాక్ భాష అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్- డాక్టర్ జి బాలయ్య పాల్గొని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు హోమియోపతి ఆర్సినిక్ ఆల్బమ్ - 30 మందునుపంపిణీ చేశారు. ఈ హోమియోపతి మందు వరుసగా మూడు రోజులు ఉదయం పరగడుపున పెద్దలు 6 గుళికలు, పిల్లలకు మూడు గుళికలు మాదిరిగా వాడినట్లయితే కరోనా వైరస్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ హోమియో గుళికలను నేరుగా నాలుకపైవేసుకొని చప్పరించాలి అని, వేసుకున్న తరువాత అరగంట పాటు ఏ విధమైనటువంటి ఘాటైన పదార్ధములను తీసుకోరాదని తెలిపారు. అలాగే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దగ్గు పడిశం జ్వరం వచ్చిన వ్యాధిగ్రస్తులు ముఖానికి మాస్కులు ధరించాలని, ఒకవేళఅవి అందుబాటులో లేని సమయంలో జేబు రుమాలుతో ముఖానికి కట్టుకోవాలని సూచించారు.