YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

20న నిర్భయ దోషులకు ఉరి

20న నిర్భయ దోషులకు ఉరి

20న నిర్భయ దోషులకు ఉరి
న్యూఢిల్లీ, మార్చి 5
నిర్భయ దోషులను ఉరి తీయడం కోసం ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారంట్ జారీ చేసింది. వీరిని మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని తాజాగా జారీ చేసిన డెత్ వారంట్‌‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి బుధవారం తిరస్కరించారు. దీంతో మళ్లీ డెత్ వారంట్ జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం అదే రోజు కోర్టును ఆశ్రయించింది.ఒకే కేసులో దోషులుగా తేలిన వారందర్నీ ఒకేసారి ఉరి తీయాలనే నిబంధనను తమకు అనుకూలంగా మలుచుకున్న దోషులు.. ఒకరి తర్వాత మరొకరు వ్యూహాత్మకంగా పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టిన తర్వాత 14 రోజుల తర్వాత ఉరి తీయాలన్న నిబంధన సైతం వారికి వరంలా మారింది దీంతో ఇప్పటి వరకూ నిర్భయ దోషుల ఉరి అమలు మూడుసార్లు వాయిదా పడింది.ప్రస్తుతం దోషులకు న్యాయపరమైన దార్లన్నీ మూసుకుపోయాయి. కానీ దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని.. మార్చి 20న వారిని ఉరి తీస్తే.. న్యాయపరంగా హత్య చేయమేనన్నారు. దీంతో ఇప్పుడైనా దోషులకు ఉరి పడుతుందా లేదంటే.. చట్టంలోని ఇంకా ఏవైనా లొసుగులను అడ్డం పెట్టుకొని మరోసారి వాయిదా పడేలా చూస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.నిర్భయ దోషుల తరఫు లాయర్‌ ఏపీ సింగ్‌ పట్ల జడ్జి ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు.2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తున్న నిర్భయను బస్సులోకి ఎక్కించుకున్న ఆరుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ప్రయివేట్ భాగాల్లో తుప్పు పట్టిన ఐరన్ రాడ్‌తో చిత్రహింసలకు గురి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె సింగపూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబర్ 29న ప్రాణాలు వదిలింది. దోషులుగా తేలిన ఆరుగురిలో ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. మైనర్ అయిన మరొకరు మూడేళ్లు జ్యువైనల్ హోంలో ఉండి విడుదలయ్యారు. మిగతా నలుగురికి మరణ శిక్ష విధిస్తూ 2017లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Related Posts