YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభకు యువరక్తం

రాజ్యసభకు యువరక్తం

 

 రాజ్యసభకు యువరక్తం
రాజ్యసభకు మార్చి 24న జరగనున్న తాజా ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలనుంచి యువరక్తం పోటెత్తే సూచనలు కనబడుతుండగా పదవీవిరమణ  చేయనున్న చాలామంది సీనియర్ల రాజకీయ జీవితం దాదాపుగా ముగియనుంది. కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్, ఎన్సీపీ, శివసేన, ఏడీఎంకే వంటి బలమైన  ప్రాంతీయ పార్టీల నుంచి కురువృద్ధులు చాలామంది మార్చి 24 తర్వాత రాజకీయ జీవితం నుంచి తెరమరుగు కానున్నారు. వీరి స్థానంలో అన్ని రాజకీయ  పక్షాల్లోంచి యువతరం ముందుకొచ్చి కీలకస్థానాలను చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, మిళింద్ దేవ్‌రా తాజాగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు మోతీలాల్ఓరా, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ  ఖాన్, మహ్మద్ ఖాన్, కుమారి సెల్జా, పవన్ కుమార్ బన్సల్, కరణ్ శుక్లా  వంటి కాంగ్రెస్ వృద్దనేతలకు ఇక ఏ ఎన్నికల్లోనూ అవకాశం ఉండకపోవచ్చు. ఇక బీజేపీ నుంచి రామ్ మాధవ్, మురళీధర్ రావు, అలోక్ కుమార్ వంటి యువనేతలకు ఈ దఫా పెద్దల సభలో పట్టం కడుతున్నారు. ఇక జేడీయూ  బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలవారీగా రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోనున్న వారి జాబితా చూద్దాం మహారాష్ట్ర: దలవాయి, హుసేన్ ఉమర్ సబ్లే, అమర్ శంకర్, ధూత్, రాజ్‌కుమా్ర్ నంద్ లాల్ పవార్, శరత్ చంద్ర గోవిందరావు, మెమోన్ అబ్దుల్ మజీద్ హాజీ   అహ్మద్, అతవాలే, రామదాస్ బండు, కకాడే, సంజయ్ దత్తాత్రేయ ఒడిశా: అనుభవ్ మొహంతి, నరేంద్ర కుమార్ స్వెయిన్, సరోజిని హెంబ్రమ్, రణజీబ్ బిస్వాల్ తమిళనాడు: శశికళ పుష్ప, కె.సెల్వరాజ్, తిరుచ్చి శివ, ఎస్ ముత్తుకరుప్పన్, రంగరాజన్, విజిలా సత్యనాథ్,  పశ్చిమబెంగాల్: రింతభరా బెనర్జీ, జోగేంద్రనాథ్ చౌదరి, డాక్టర్ కన్వర్ దీప్ సింగ్, మనిష్ గుప్తా, అహ్మద్ హసన్,  ఆంధ్రప్రదేశ్: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, కె. కేశవరావు తెలంగాణ: కేవీపీ రామచంద్రరావు, గరికిపాటి మోహనరావు అస్సాం: భుబనేశ్వర్ కలితా, డాక్టర్ సంజయ్ సిన్హ్, బిశ్వజిత్ డైమరి బీహార్: కక్షణ్ పర్వీన్, రవీంద్ర కిషోర్ సిన్హా, రామ్ నాథ్ ఠాకూర్, హరివంశ్ నారాయణ సింగ్, సీపీ ఠాకూర్. చత్తీస్‌గఢ్: రన్‌విజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్, మోతీలాల్ వోరా,  గుజరాత్: గోహెల్ ఛునిబాయ్ కంజిబాయి, మిస్త్రీ మధుసూధన్ దేవ్రామ్, వడోదయ లాల్ సింగ్ ఉద్ సిన్హ్, తుండియ శంభుప్రసాద్ బల్దవ్ దాస్ జీ, హర్యానా: రామ్ కుమార్, కుమారి సెల్జా హిమాచల్ ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్,  ర్ఖండ్: నత్వాని పరిమళ్, ప్రేమ్ చంద్ గుప్తా మధ్యప్రదేశ్: ప్రభాత్, సత్యనారాయణ్ జతియా మణిపూర్: క్షేత్రిమయుమ్ భబానంద సింగ్ రాజస్తాన్: నారాయణ్ లాల్ పంచారియా, రామ్ నారాయణ్ దూడి, విజయ్ గోయెల్, మేఘాలయ: వంశుక్ సీయమ్  రాజ్యసభ సభ్యులంతా ఏప్రిల్ 2 నుంచి 12 వతేదీలోపు తమ సభ్యత్వాలు కోల్పోనున్నారు. వీరిస్తానాల్లో అన్ని పార్టీలనుంచి దాదాపుగా యువతరమే తాజాగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా, రాజ్యసభ ఎన్నికలకు గాను మార్చి 6వ నోటిఫికేషన్, 13న నామినేషన్లకు చివరి తేదీ, 16న నామినేషన్ల స్క్రూటినీ, 18న అభ్యర్థుల ఉపసంహరణ   చివరితేదీ, 26 మార్చి 2020న పోలింగ్, కౌంటింగ్ మార్చి 26, ఎన్నికల ప్రక్రియ ముగింపు మార్చి 30.

Related Posts