Highlights
- మే 6 న పరిటాల కుమార్తె డా. స్నేహలత వివాహం
- పెళ్లి పత్రికను శ్రీవారి వద్ద ఉంచిన సునీత
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంత్రి పరిటాల సునీత రవీంద్ర ల కుమార్తె డా. స్నేహలత వివాహం మే 6 న జరగనున్నది. ఈ నేపద్యంలో వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.