YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అనంతపురంలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ

 అనంతపురంలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ

 అనంతపురంలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ
అనంతపురం, మార్చి 6
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులతో బ్రేక్‌ పడినట్టయింది. 59.85 శాతం రిజర్వేషన్లు చెల్లవని, 50 శాతంలోపే ఉండాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో త్వరలో జరుగుతాయనుకున్న ఎన్నికలు ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధపడిన నాయకుల్లో ఉత్సాహం నెలకొని ఉండింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఆయా స్థానాలకు ఖరారయ్యాయి. జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పదవి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఎస్సీలకు రిజర్వు అయింది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత తొలిసారిగా ఎస్సీలకు రిజర్వు కావడం గమనార్హం. అయితే ఈ రిజర్వేషన్లు 59.85 శాతం ప్రకారం జరిగాయి. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో రిజర్వేషన్లు ఇది వరకు జరిగిన వాటిల్లో మార్పులు జరగాల్సి ఉంటుంది. 50 శాతంలోపుకు రిజర్వేషను స్థానాలను కుదించాలి. దీంతో ఇప్పటి ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన రిజర్వేషన్‌ ప్రక్రియ మొత్తం మారనుంది. దీంతో రిజర్వుడు స్థానాల ఆధారంగా ఎన్నికల బరిలో నిలుచుకునేందుకు సిద్ధపడుతున్న నాయకులకు తీరని నిరాశనే ఎదురు కానుంది. ఇప్పటికే గ్రామాల్లో పార్టీల వారీగా ఎవరు పోటీలో ఉంటారన్న దానిపైనా ఒకరకమైన కసరత్తు జరిగింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మొత్తం ఆశలు ఆవిరయ్యాయి. 50 శాతంలోపు తిరిగి కొత్తగా జరిగే రిజర్వేషన్లలో తాము పోటీ చేయాలనుకున్న స్థానం పరిస్థితి ఏమవుతుందోనన్న ఉత్కంఠత వారిలో నెలకొంది. తిరిగి రిజర్వేషన్లు నిర్దారించి ఎన్నికలు నిర్వహించే సరికి ఎంత సమయం పడుతుందన్నది కూడా తెలియకపోవడంతో అవుత్సాహిక నాయకుల్లో ఉత్సాహం నీరుగారిపోతోంది. ఇక పురపాలక సంఘాలకు సంబంధించి రిజర్వేషన్లు ఇంకా ఖరారవలేదు. దీంతో 50 శాతంలోపుకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి పెద్దగా సమస్య ఉండే అవకాశం లేదు. అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది చూడాల్సి ఉంది. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతోపాటు 12 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో వార్డు రిజర్వేషన్లు ఇంకా ఖరారవలేదు. వీటి కోసం కూడా నాయకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇవిగనుక 50 శాతంలోపు ఖరారు చేస్తే వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పెద్దగా సమస్యలుండే అవకాశం లేదు. దీంతో ముందుగా పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయా లేక ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల తరువాతనే వీటికి నిర్వహిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే నాయకులు మాత్రం ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related Posts