YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజ్యసభ కోసం ఒత్తిళ్లు...

రాజ్యసభ కోసం ఒత్తిళ్లు...

 రాజ్యసభ కోసం ఒత్తిళ్లు...
చెన్నై, మార్చి 6
రాజకీయాల్లో హామీలు మామూలే. వాగ్దానాలు సాధారణమే. అయితే సమయం వచ్చే సరికి నాయకత్వం మాట మీద నిలబడుతుందా? లేదా? అన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటాయి. తమిళనాడులో అన్నాడీఎంకే అగ్రనేత, ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. పార్టీనే ఏళ్లుగా నమ్ముకున్న వ్యక్తులకు ఆసరాగా ఉండాలా? కూటమిలో తాత్కాలికంగా వచ్చి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా? అన్నది తేల్చుకోలేక పోతున్నారు.తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో శాసనసభలో సభ్యుల బలాన్ని బట్టి అధికార అన్నాడీఎంకేకు మూడు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్నాయి. ఇందుకోసం సొంత పార్టీ నేతల నుంచే పోటీ ఎక్కువగా ఉంది. అనేక మంది సీనియర్లు తమను విస్మరించవద్దంటూ పళనిస్వామికి ఇప్పటికే వినతులు ఇచ్చారు. తమ ప్రొఫైల్ చూసి నిర్ణయం తీసుకోమని సూచించారు. సీనియర్లకు అవకాశమివ్వకుంటే వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సహకరించకుండా వైరిపక్షాన చేరే అవకాశముంది.రాజ్యసభ పదవీ కాలం ఆరేళ్లు కావడం, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. అధికారంలోకి తిరిగి రామన్న నమ్మకం లేదు. పోనీ కనీస స్థానాలు సాధిస్తామన్న విశ్వాసమూ లేదు. రజనీకాంత్ ఎంట్రీతో దారుణంగా దెబ్బతినేది అధికార అన్నాడీఎంకే పార్టీ మాత్రమే. అందుకోసమే ఆరేళ్లు పదవీకాలం ఉన్న రాజ్యసభ స్థానాల కోసం సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పరోక్షంగా వార్నింగ్ లు పంపుతున్నారు. విజయకాంత్ పార్టీ డీఎండీకే నుంచి కూడా పళనిస్వామి పై వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. డీఎండీకే కోశాధికారి, విజయకాంత్ సతీమణి ప్రేమలత పరోక్షంగా పళనిస్వామికి హెచ్చరికలు పంపారు. తమకు ఒక స్థానాన్ని కేటాయిస్తామని గత లోక్ సభ ఎన్నికల సమయంలోనే మాట ఇచ్చారని, ఆ మేరకే తాము కూటమిలో చేరామని ప్రేమలత చెబుతున్నారు. తన సోదరుడు సుదీశ్ పేరును ఆమె ఇప్పటికే పళనిస్వామికి పంపారు. రాజ్యసభ స్థానం తమకు ఇవ్వకపోతే కూటమిలో కొనసాగే విష‍యం పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే పళనిస్వామి మాత్రం ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఇటు సీనియర్లు హెచ్చరికలు, అటు కూటమి పార్టీ డీఎండీకే వత్తిడులతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

Related Posts