YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కమల్ నాధ్ మెడపై వేలాడుతన్న కత్తి

 కమల్ నాధ్ మెడపై వేలాడుతన్న కత్తి

 కమల్ నాధ్ మెడపై వేలాడుతన్న కత్తి
భోపాల్, మార్చి 6
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంటుందా? ఎమ్మెల్యేలను కర్ణాటక తరహాలో ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే అవుననే అంటున్నారు. మధ్యప్రదేశ్ లో అతి తక్కువ మెజారిటీతో అధికారాన్ని ఈడ్చుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన నాటి నుంచే ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి మధ్యప్రదేశ్ పై బీజేపీ కన్నేసిందన్న వార్తలు వస్తున్నాయి.2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ 109 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను దక్కించుకుంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 115 స్థానాలు కావడంతో కాంగ్రెస్ కు కూడా సంపూర్ణ మెజారిటీ లభించలేదు. దీంతో కాంగ్రెస్ స్వతంత్ర సభ్యులు నలుగురిని, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సహజంగా మృదు స్వభావి అయిన శివరాజ్ సింగ్ గౌరవంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పి తప్పుకున్నారు.నిజానికి పెద్ద రాష్ట్రం సుదీర్ఘకాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయాల్సి ఉంది. తక్కు వ మెజారిటీతో ఉన్న ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. అక్కడ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ లు యువనేత జ్యోతిరాదిత్య సింధియాను పక్కన పెట్టారు. సింధియాను అణగదొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బయలు దేరింది. చివరకు ప్రభుత్వంలో పక్కన పెడితే పార్టీ పగ్గాలు సింధియాకు ఇచ్చేందుకు కూడా ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు.ఈ సమయంలోనే కొందరు అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మరో మూడున్నరేళ్ల తర్వాతే మధ్యప్రదేశ్ లో ఎన్నికలున్నాయి. ఇంతకాలం అధికారంలో ఉండాల్సిన కాంగ్రెస్ తనంతట తానే చిక్కులు తెచ్చుకుంటోంది. ఇందుకు తాజా ఉదాహరణే తమ పార్టీ నేతలను ఒక్కొక్కరిని 25 కోట్ల నుంచి 45 కోట్లు పెట్టి బీజేపీ కొనుగోలు చేస్తుందని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించడమే. కమల్ నాధ్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీ పై ఆయన చేసిన ఆరోపణలు పక్కన పెడితే ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత డిగ్గీరాజా పై లేదా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. మొత్తం మీద కమల్ నాధ్ ప్రభుత్వానికి ఎసరు ఉన్నట్లే కన్పిస్తుంది.

Related Posts