YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో దారుణం

యూపీలో దారుణం

యూపీలో దారుణం
లక్నో, మార్చి 6
చెల్లి చెల్లి అంటూ ఆమెపైనే కన్నేశాడో కామాంధుడు. అన్న అని పిలిపించుకున్న మృగాడు.. ఆ కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో గొంతుకోసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. చుట్టుపక్కల స్థానికులు రావడంతో బెంబేలెత్తిపోయిన యువకుడు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది.ప్రేమకు నిలయమైన తాజ్ మహల్ కొలువైన ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలిపై అన్న అత్యాచార యత్నం చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని తాజ్‌ గంజ్ ప్రాంతానికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉండేవాడు. చెల్లి చెల్లి అని పిలుస్తూ చనువు పెంచుకున్నాడు. తీరా అదను చూసి కామంతో బుసలు కొట్టాడు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను రేప్ చేసేందుకు యత్నించాడు. ఇప్పటి వరకూ అన్నలా నటించిన మృగాడి నిజస్వరూపం చూసి నిర్ఘాంతపోయిన యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. రేప్ చేసేందుకు విఫల యత్నం చేసిన యువకుడు చివరికి ఆమె గొంతుకోసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు విన్న స్థానికులు ఇంటి దగ్గరకు వస్తుండడం గమనించి తన గొంతు కూడా కోసేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.రక్తపు మడుగులో పడి ఉన్న యువతీ, యువకులను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌లోకి వచ్చిన పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. యువతిపై అత్యాచార యత్నం చేసి గొంతుకోసేశాడని.. అనంతరం ఆత్మహత్యా యత్నం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Related Posts