YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 ఆన్ లైన్ లో  2020 జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

 ఆన్ లైన్ లో  2020 జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

 ఆన్ లైన్ లో  2020 జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
తిరుమల మార్చి 6
 2020, జూన్ నెల కోటాకు సంబంధించి మొత్తం 60,666 శ్రీవారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్లను శుక్రవారం  ఉదయం విడుదల చేసారు. ఆన్లైన్ డిప్ విధానంలో 9,966 సేవా టికెట్లు విడుదల చేసారు. ఇందులో సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి.  ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 50,700 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 13,300, 
ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్ర దీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల నమోదు వివరాలు  :
ఆన్లైన్లో ఆర్జితసేవా టికెట్ల విడుదల : మార్చి 6, ఉదయం 10 గం||లకు.
- ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు చివరి తేది   : మార్చి 10వ తేదీ ఉదయం 10 గం||ల వరకు.
- ఎలక్ట్రానిక్ డిప్      : మార్చి  10న ఉదయం 10 నుండి 12గం||ల వరకు.
- నగదు చెల్లింపు     : మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల నుండి మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల వరకు.

Related Posts