ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 21.68 లక్షల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల, మార్చి 6,
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 21.68 లక్షల మందికి శ్రీవారి దర్శన భాగ్యం దొరికింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.89.07 కోట్లు కాగా శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గదుల వివరాలు ఇలా ఉన్నాయి. దర్శనం :గతేడాది ఫిబ్రవరిలో 19.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 21.68 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.హుండీ ఆదాయం :శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.83.44 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.89.07 కోట్లు వచ్చింది.అన్నప్రసాదం : గతేడాది ఫిబ్రవరిలో 43.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 48.40 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది. లడ్డూలు గతేడాది ఫిబ్రవరిలో 83.91 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో 82.38 లక్షల లడ్డూలను అందించారు. తలనీలాలు గతేడాది ఫిబ్రవరిలో 6.70 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ ఫిబ్రవరిలో 7.77 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.గదులు గదుల ఆక్యుపెన్సీ గతేడాది ఫిబ్రవరిలో 102 శాతం నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 103 శాతం నమోదైంది.