YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ......

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ......

 విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ......
స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుత ప్రగతి 
శాసనసభ లో గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్ మార్చి 6
రైతు బంధు పథకం దేశానికే రోల్ మోడల్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.   తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సభ్యులందరికి నమస్కరిస్తూ ఆమె ప్రసంగం ప్రాంరంభించారు. ఆరు దశాబ్దాల పాటు పోరాటం కొనసాగించి, తెలంగాణసమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగింది. చాలా స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవడం మనందరికీ గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే, సాకారమైన స్వరాష్ట్రానికి సారధి అయి ముందుకు నడిపించడం తెలంగాణకు కలిసొచ్చిన అంశం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం ఫలితంగా కుదేలైన అన్ని రంగాలకు పునరుత్తేజం కల్పించడానికి దార్శనిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు. 
రాష్ట్రం ఏర్పడిన నాడున్న పరిస్థితులతో నేటి పరిస్థితులను ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి, యావత్ దేశం అబ్బురపడుతుందని ఆమె అన్నారు.   తెలంగాణ రాష్ట్రం తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్నది.నిత్య విద్యుత్ కోతలతో రాష్ట్రం గాఢాంధకారంలో ఉండేది. నిరాశా నిస్పృహకు లోనైన వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దుర్భర పరిస్థితులు నెలకొని ఉండేవి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి వున్న వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలు, అన్నీ అంచనా వేసుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు రూపొందించుకుని, రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు.రైతు బీమా పథకం వ్యవసాయానికి భరోసానిచ్చిందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తున్నామన్నారు. పేద  విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ విద్యాలయాల నిర్వహణ చేస్తున్నామన్నారు. 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నామన్నారు. మరణించిన మత్స్యకారులు, గీత కార్మికుల కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మించి ఇచ్చే పథకం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నది.   డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకం క్రింద ఇప్పటి వరకు 2, 72, 763 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నదని గవర్నర్ అన్నారు.  ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ, ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యధాతధంగా అమలు చేస్తూ, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ అత్యంత ఆశావహ దృక్పథంతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకుఅనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలియ చేస్తున్నానని అన్నారు.  “ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వ లేని రాజ్యమే గొప్ప రాజ్యమని తమిళం లో చెబుతూ ప్రసంగం ముగించారు. 

Related Posts