YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క‌రోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు 

క‌రోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు 

క‌రోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు 
హైద‌రాబాద్‌ మార్చ్ 6
  స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. క‌రోనా వైర‌స్ భ‌యం.. షేర్ మార్కెట్ల‌ను షేక్ చేశాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మంద‌గమ‌నం వ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు వెల‌వెల‌బోయాయి.  బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 1300 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ 37,180 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది.  నిఫ్టీ కూడా ప‌త‌న‌మైంది.  385 పాయింట్లు కోల్పోయింది. దీంతో నిఫ్టీ 10881 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లు ఇంత డీలాప‌డ‌డం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో రూపాయి మార‌కం విలువ కూడా అత్య‌ల్పానికి ప‌డిపోయింది. డాల‌ర్‌తో పోలిస్తే 61 పైస‌లు త‌క్కువైంది.  రూపాయితో డాల‌ర్ విలువ 73.94 నుంచి 73.33 పైస‌ల‌కు ప‌డిపోయింది.  క‌రోనా భ‌యంతో పాటు యెస్ బ్యాంకుపై ఆర్బీఐ కార్యాచ‌ర‌ణ‌కు దిగ‌డంతో.. భార‌తీయ మార్కెట్లు కొంత ఊగిస‌లాడాయి. యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విష‌యం తెలిసిందే.  50వేల‌కు మించి విత్‌డ్రా చేసుకోరాదు అని ఆర్బీఐ ఆ బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.  దీంతో యెస్ బ్యాంకు షేర్లు 25 శాతం ప‌డిపోయాయి.  కోలా ఇండియా, టీసీఎస్‌, టెక్ మ‌హీంద్రా, టాటా మోటార్స్‌, ఆర్ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు కూడా డౌన‌య్యాయి.

Related Posts