Highlights
- ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేని శివాజీ
- ‘తలచుకుందాం ప్రేమతో’ ఆవిష్కరించిన జస్టిస్ చలమేశ్వర్
ప్రస్తుత రాజకీయాల గురించి తానేమి మాట్లాడానని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విజయవాడలో ఆయన యలమంచిలి శివాజీ రాసిన ‘తలచుకుందాం ప్రేమతో’ పుసక్తాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ..మరో రెండు నెలల పాటు రాజకీయాల గురించి తాను మాట్లాడనని చెప్పారు. త్వరలో రిటైర్మెంట్ కానున్న చలమేశ్వర్ స్వయంగా వెల్లడించారు. కాగా రాజకీయల్లో పదవులు అనుభవించాక జైలుకు వెళుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఒకప్పుడు రాజకీయాల కోసం జైలుకు వెళ్లిన నేతలు ఉన్నారని గుర్తిచేశారు. ఇలాంటి వాతావరణంలోని నాయకుల మధ్య ఇమడలేరని యలమంచిలి శివాజీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఇదిలాఉండగా తనకు పరిచయం కలిగిన వ్యక్తుల గురించి, తనకు నచ్చిన వారి గురించి పలు సందర్భాల్లో యలమంచిలి శివాజీ రాసిన వ్యాసాలను ‘తలచుకుందాం ప్రేమతో’ సంకలనాన్ని పొందుపరిచారు. ‘పదహారణాల గాంధేయవాది మంతెన’, ‘రాజర్షి రాజన్న’, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్’ వంటి వ్యాసాలను కూడా ఇందులో పొందుపర్చడం గమనార్హం.