పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన మాజీ సర్పంచ్
శ్రీకాకుళం మార్చ్ 6
ఇరువర్గాల మధ్య వివాదం కారణంగా మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ సర్పంచి అవినాష్ చౌదరి పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు ఓ వ్యక్తి రాగా..అతన్ని నెట్టివేసి అవినాష్ చౌదరి భవనంపై నుంచి ఒక్కసారిగా దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అవినాష్ శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు బాబ్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మి తనయుడు.