YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

డిఫరెంట్ కథతో పలాస 1978

డిఫరెంట్ కథతో పలాస 1978

డిఫరెంట్ కథతో పలాస 1978
కొన్ని సినిమాలు విడుదల అయ్యాక,దాని చూసిన ప్రేక్షకులు చెప్పిన తీర్పును బట్టి అది హిట్టా లేక ఫట్టా అనేది డిసైడ్ అవుతుంది.కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే విడుదలకు ముందే గ్యారంటీ హిట్ అనే గుర్తింపు,నమ్మకం ప్రేక్షకులకు కలిగించగలుగుతాయి. ఈ మధ్యకాలంలో అలాంటి గుర్తింపు, నమ్మకం కలిగించిన సినిమా 'పలాస 1978'.ఒక చిన్న సినిమాగా మొదలయినా కూడా ఈ సిమిమాని పెద్ద వాళ్లంతా చూసి బావుంది అంటూ కితాబులు ఇవ్వడం,ఆ సినిమా డైరెక్టర్ కి రిలీజ్ కి ముందు రోజే అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ సెకండ్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడం, ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూట్ చెయ్యడంతో పలాస పై చాలామందికి ఆసక్తి ఏర్పడింది. అలా అంచనాలు లేని స్థితి నుండి భారీ అంచనాలు ఏర్పడే స్థాయికి వెళ్లిన పలాస 1978 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకుల్లో ఏర్పరిచిన అంచనాలు ఎంతవరకు అందుకు అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ సినిమా పేరుకి తగ్గట్టే పలాస అనే ప్రాంతంలో 1978 నుండి మొదలవుతుంది ఈ సినిమా కథ.పలాస జిల్లాలో తక్కువజాతి వాళ్ళు ఉండే ప్రాంతం అంబుసోలి. అక్కడ ఉండే అన్నదమ్ములు మోహన రావు(రక్షిత్), అతని అన్న రంగారావు(తిరు వీర్) ఇద్దరూ కూడా నాట్య కళాకారులు. ఇక అదే పలాస ప్రాంతంలో ఉండే పెద్ద షావుకారు, చిన్న షావుకారు(రఘు కుంచె) ఇద్దరూ కూడా ఆధిపత్య పోరు సాగిస్తూ,అధికారం కోసం పోటీ పడుతూ ఉంటారు.కానీ పెద్ద షావుకారు కి ఆ ప్రాంతంలో పేరుమోసిన రౌడీ అయిన భైరాగి అండ ఉండడంతో అంతా భయపడతారు. కానీ అనుకోకుండా పెద్ద షావుకారు కొడుకుకి,రంగారావు కి జరిగిన గొడవ వల్ల మోహన రావు భైరాగిని చంపేస్తాడు.అలా మోహన రావు, రంగారావు అనుకోకుండా రౌడీలుగా మారతారు.దాంతో అన్న పై పైచేయి సాధించాలి అనుకున్న చిన్న షావుకారు ఆ అన్నదమ్ములు ఇద్దరిని చేరదీసి రాకీయంగా ఎదగడానికి వాళ్ళను వాడుకుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత చిన్న షావుకారుతో కూడా గొడవరావడం, పోలీసుల వార్నింగ్ తో ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళి బ్రతుకుతుంటారు.కానీ వాళ్ళ గతం వల్ల తయారయిన శత్రువులు వాళ్లపై పగ తీర్చుకోవడానికి చూస్తుంటారు. ఇక అక్కడినుండి ఏం జరిగింది?, ఆ ఇద్దరు అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి?,చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.1978 బ్యాక్ డ్రాప్, పల్లెటూరిలో నడిచే సినిమా,రాజకీయానికి సంబందించిన కథనం,పెద్ద జాతిపై పోరాడిన ఇద్దరు అన్నదమ్ములు,సహజత్వం ఉట్టి పడే పాత్రలు ఇవన్నీ చెప్పగానే ఎంతవద్దు అనుకున్నా కూడా లేటెస్ట్ సినిమాల్లో క్లాసిక్ లాంటి ఇండస్ట్రీ హిట్ రంగస్థలం కళ్ళముందు కదలాడుతుంది.అందుకే డైరెక్టర్ తెలివిగా ఈ సినిమాని తాను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్రలో అందరికి బాగా పరిచయం ఉన్న పలాస ప్రాంతంలో జరిగినట్టుగా చూపించాడు. అక్కడ నుండి వచ్చినవాడు కావడంతో అక్కడ నేటివిటీని చాలా డీటైలింగ్ గా చూపించాడు.అలాగే సినిమాలో ఎక్కడా కూడా ఆ స్లాంగ్ మిస్ కాకుండా ప్రతి పాత్రతో శ్రీకాకుళం యాస మాట్లాడించాడు.ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.కానీ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఒక తలతెగి పడే హత్య సీన్ తో ఆ ప్రాంతంలో గతంలో ఏం జరిగింది అని చెప్పడం మొదలు పెట్టిన డైరెక్టర్ మొదటి నుండి చివరి వరకు కూడా తెల్సిన కథనే కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు.ఆయా పాత్రలు, ఎంచుకున్న నేపథ్యం వల్ల అది వైవిధ్యంగా కనిపిస్తుంది అని భావించాడే తప్ప కథలో మాత్రం ఎలాంటి కొత్తదనం కూడా లేదు.తక్కువ జాతివాళ్ళపై, ఎక్కువ జాతి వాళ్ళు సాగించే పెత్తనం,వాళ్ళను వాడుకునే విధానం, వాళ్ళు తిరగబడితే ఏం జరుగుతుంది అనే విషయాలమీదే సినిమాని నడిపించాడు.ఇదే కథతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమాని ఆ సినిమా టీమ్ అంతా బలంగా నమ్మడానికి కారణాలు రెండు. నేటివిటీ ఫ్యాక్టర్ అండ్ పీరియాడిక్ టైమ్ ఫ్రేమ్.అయితే సినిమాని మొదలు పెట్టిన విధానం,పాత్రల పరిచయం,కథనం కాస్త కొత్తగా ఉండడం వల్ల ఆసక్తిగానే మొదలయిన సినిమా తక్కువ జాతి,ఎక్కువ జాతి మధ్య పోరాటం అనే సింగల్ థ్రెడ్ పైనే కథ రాసుకోవడం వల్ల ముందుకు కదలడానికి మొరాయిస్తుంది. దానికి తోడు చాలా చోట్ల ఏం జరగబోతుంది అనే సినిమాలోనే పాత్రలకంటే ముందే సినిమా చూస్తున్న ప్రేక్షకులకే తెలిసిపోతుంది.అయినా కూడా ఫోర్త్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే తో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచటానికి ప్రత్నించిన డైరెక్టర్ ఇంటర్వెల్ వరకు అక్కడక్కడా బోర్ కొట్టించినా కూడా కూర్చోబెట్టగలిగాడు.కానీ ఇంటర్వెల్ తరువాత మొదటి సీన్ అయ్యాక మాత్రం సినిమా ఒక విధానం లేకుండా రకరకాలుగా సాగిపోయింది. దాదాపుగా సెకండ్ హాఫ్ మొత్తం దాడులు,ప్రతి దాడులు అన్నట్టుగానే సాగిపోయింది. ఇక ఎదో చూపిస్తాడు అనుకున్న క్లయిమాక్స్ చాలా పేలవంగా ఉంది.బ్యాలెన్సింగ్ గా చెప్పాల్సిన సెన్సిటివ్ పాయింట్ ని డైరెక్టర్ చాలా సునాయాసంగా ఒకే వర్గానికి ఫేవర్ గా చెప్పేసాడు అన్న భావన కలుగుతుంది.డైరెక్టర్ కరుణ కుమార్ మాత్రం సినిమాని తాను ఎలా తియ్యాలనుకున్నాడో అలానే తీసాడు.పాత్రల ఎంపిక నుండి వాళ్ళు మాట్లాడుకునే భాష వరకు చాలా సహజంగా ఉండేలా చూసుకున్నాడు. డైలాగ్స్ కూడా చాలావరకు పేలాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం బూతులు మాట్లాడించాడు. ఎంత సహజత్వం అయినా,సినిమా ఎంత రా అప్పీల్ లో ఉండాలి అనుకున్నా కూడా మరీ ఆ రేంజ్ లో, అవలీలగా, తెలుగులో వేరే పదాలే లేవన్నట్టుగా బూతులు మాట్లాడించడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. హీరో పాత్ర నుండి పోలీస్ పాత్ర వరకు అంతాకూడా వినడానికి ఇబ్బందిగా అనిపించే బూతులు చాలా సార్లు మాట్లాడారు. వాటి మోతాదు కాస్త తగ్గించి ఉండాల్సింది.డైరెక్టర్ ఈ సినిమా కథ కోసం చేసిన రీసెర్చ్,అలాగే నిజమయిన లొకేషన్స్ లో చిత్రీకరణ,సీన్స్ లో ఇంటెన్సిటీ క్రియేట్ చేసిన విధానం మాత్రం మెప్పిస్తుంది.అలాగే సినిమాని పనిచేసిన సాంకేతికనిపుణలను వాడుకున్న విధానం, అవుట్ ఫుట్ రాబట్టుకున్న తీరు కూడా మెప్పిస్తుంది.ఒక్క సినిమా అనుభవం ఉన్న రక్షిత్ ఈ సినిమాని ఎంచుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల సన్నివేశానికి ఉన్న బలాన్ని అతని నటన నిలబెట్టలేకపోయింది అనిపిస్తుంది. కనీసం అతని పాత్రకి కాస్త బేస్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది.కానీ అతను ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. కాస్త అనుభవం వస్తే మంచి నటుడు అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ నక్షత్ర మాత్రం తన పాత్ర పరిధి వరకు వంక పెట్టడానికి లేకుండా నటించింది.చిన్న షావుకారుగా రఘుకుంచె ఓకే అనిపిస్తాడు.చాలా కాలం తరువాత మిర్చి మాధవికి కాస్త ఇంపాక్ట్ ఉన్న పాత్ర దక్కింది.ఆ పాత్రకి ఆమె న్యాయం చేసింది. ఇక మిగిలిన పాత్రలు అన్నీ కూడా డైరెక్టర్ విజన్ కి తగ్గట్టుగా కనిపించాయి,పర్లేదు అనిపించాయి.రఘు కుంచె అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనుకోవాలి.పాటలు సినిమా ఫ్లో లో కలిసి సాగిపోయాయి.నేపధ్య సంగీతం చాలా క్వాలిటీ గా ఉంది. కాకపోతే అక్కడక్కడా కాస్త లౌడ్ నెస్ ఎక్కువయింది.విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.నిర్మాణ విలువలు ఒక మోస్తరుగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక మంచి రా అప్పీల్ ఉన్న,కొత్తదనం ఫీల్ అయ్యే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాలని పలాస టీమ్ నిజాయితీగా చేసిన ప్రయత్నం ఈ సినిమా. కాకాపోతే ఆ ప్రయత్నంలో ఉన్న లోపాలు మాత్రం సినిమా రేంజ్ ని తగ్గించి,దీన్ని కూడా ఒక సగటు సినిమాగా మార్చాయి అనే ఫీలింగ్ కలిగింది.

Related Posts