YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీ రిజర్వేషన్లు కాపాడడం లో విపలమైన వైసీపీ ప్రభుత్వం

బీసీ రిజర్వేషన్లు కాపాడడం లో విపలమైన వైసీపీ ప్రభుత్వం

బీసీ రిజర్వేషన్లు కాపాడడం లో విపలమైన వైసీపీ ప్రభుత్వం
జి ఓ నెం 559 ప్రతులను తగల బెట్టిన టిడిపి
నెల్లూరు  మార్చ్ 06 
స్థానిక సంస్థలలో బి సి ల కు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లు కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  ఏలూరు కృష్ణయ్య అన్నారు. బిసి రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ నెం 559 ప్రతులను కోవూరు తాలూకా ఆఫీస్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ లో తగలబెట్టారు.  ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో  మొట్టమొదటి సారిగా తెలుగుదేశం పార్టీ 1987 సంవత్సరం లో స్థానిక సంస్థలలో బిసిలకు రిజర్వేషన్లు కలిపించిందని,గత 33 సంవత్సరం ల నుంచి రాష్ట్రంలో  బిసి లకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అటువంటిది ఇప్పుడు బి సీలకు రిజర్వేషన్లు తగ్గించారని,10 శాతం రిజర్వేషన్లు తగ్గించిన దాని వలన దాదాపు  16 వేల మంది బిసిల పదవులు రాకుండా పోతాయని,గతంలో హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు ఇచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీలను కలుపుకొని, సుప్రీంకోర్టు కెల్లీ బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు తో స్థానిక ఎన్నికలు జరిపారని అయితే నేడు ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు ఇచ్చిన మరుక్షణం బిసిలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ జి ఓ నెం 559 జారీ చేసి బిసిల  గొంతు కోసారని అన్నారు. బిసి నాయకులు కావలి ఓంకార్ మాట్లాడుతూ బిసి లకు రిజర్వేషన్లు తగ్గించడం వలన  బిసి అన్యాయం జరిగిందని, ఇప్పటికయినా ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు బిసి రిజర్వేషన్లు పై సుప్రీంకోర్టు కెల్లీ బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేక పోతే ముఖ్యమంత్రి బిసి ల ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలపర్తి శ్యాం, బత్తల రమేష్, బాల రవి, పడవల ఆదిశేషయ్య, ఉయ్యురు వేణు, మారుబోయిన వెంకటేశ్వర్లు, ఆదిశేషయ్య, పాలూరు వెంకటేశ్వర్లు, భువనగిరి మల్లికార్జున, ఒక్కంటి గోపాలకృష్ణ, కాసుల శ్రీనివాసులు, మునగపాటి వెంకటేశ్వర్లు, సూరిశెట్టి శ్రీనివాసులు, పెనుమల్లి శ్రీహరి రెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,  ఒబ్బారెడ్డి మల్లికార్జున తదితరులు  పాల్గొన్నారు.

Related Posts