YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూల్ కూల్.. హైదరాబాద్ కూల్..

Highlights

హయత్ నగర్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు
మల్కాజ్ గిరి, సైనిక్ పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం
సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన

కూల్ కూల్.. హైదరాబాద్ కూల్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఆదివారం  సాయంత్రం నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు పడగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాలు మౌలాలి, నేరెడ్ మెట్, తార్నాక, ఓయూ, నాచారం, సీతాఫల్ మండి, చిలకలగూడ, కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ అడ్డగుట్ట, తుకారాం గేట్ లో వడగండ్ల వాన కురిసింది. హయత్ నగర్, దిల్ షుక్ నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, రామంతాపూర్, అంబర్ పేట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో చిరుజల్లులు పడ్డాయి. అదే మల్కాజ్ గిరి, సైనిక్ పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Related Posts