Highlights
- ఇతరుల లోపాలు గుర్తించడం మోదీ అవలక్షణం
- వ్యక్తిత్వ వికాస నిపుణుడు నరసింహారావు
ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి పట్ల ఎలాంటి అనుబంధం లేని వ్యక్తని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఇతరుల లోపాలు గుర్తించడం మోదీ అవలక్షణం చెప్పారు. మోదీకి ఏ పరిజ్ఞానమూ లేదు, ఏ పనీ చేయలేరు. చివరికి మోదీ మంత్రి వర్గంలో ఒక్క సమర్థుడూ లేరని స్పష్టం చేశారు. సహజ సిద్ధ మావన స్పందనలు లేవని, మానవ స్పందనలు లేకపోవడం వ్యక్తిత్వ లోపమన్నారు. ప్రతి ఒక్కరినీ ఆయన తక్కువగానే చూస్తారు! సన్నిహితులైన వాఘేలా, తొగాడియాను మోదీ దూరం చేసుకున్నారు. ‘మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండాలన్న భావన మోదీలో చిన్నప్పటి నుంచి ఉంది. వాస్తవానికి ఏ వ్యక్తీ అన్ని పనులు సంపూర్ణంగా చేయలేరు.మోదీ మనసులో ఉన్నది ఆయన చేస్తారు. మోదీ ఆర్ఎస్ఎస్ లో పని చేయాలని ఆయన చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి పీఎం స్థాయికి మోదీ ఎదిగారు. కానీ హిందూమతం పట్ల మోదీకి ఎటువంటి ప్రేమలేదు.. ఆ మతాన్ని వాడుకుంటున్నారు. అహ్మదాబాద్ లో వంద ఆలయాలు కూలగొట్టించారు. ఆ ఆలయాలను ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించింనందుకు ప్రవీణ్ తొగాడియాను జైల్లో పెట్టించారన్నారు. తన కన్నా పెద్దవాళ్లను, ఆదరించిన వాళ్లను మోదీ పట్టించుకోరనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చన్నారు.మోదీకి, అమిత్ షాకు ఎలాంటి అనుబంధం లేదు.మోదీకి అమిత్ షా చక్కని అనుచరుడని చెప్పారు. అయితే ఆయనకు అందరూ స్వార్థపరులేనన్నది ఆయన అభిప్రాయం. మోదీ అంటే యశోదాబెన్ కు ఎనలేని ప్రేమ. మోదీ పేపర్ కటింగ్స్ అన్నీ సేకరించి ఆమె దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు.