*హోళీ-సందేశం*
*గోపికలతో ఆడుకుంటున్న బాల కృష్ణున్ని రాధ నల్ల వాడని ఆట పట్టించిందట.దీంతో కృష్ణయ్య అలిగాడు.అలిగిన కృష్ణయ్యను శాంత పరచడానికి అమ్మ యశోద రాధపై ముఖానికి రంగులు పూయమని కన్నయ్యతో చెప్పిందట* కృష్ణుడు అలాగే చేసాడు.గోపికలందరూ రంగులు చల్లు కున్నారు.అలా హోళీ పండుగ పుట్టిందని నానుడి. అలాగే మన జీవితాలలో కూడా అలకలు, కినుకలు, తొందరపాటులు, కోపాలు, తాపాలు, తెలిసో తెలియకో ఆవేశాలు అపశ్రుతులు అవివేకాలు మాట జారటాలు మాటలు పడటాలు అనుకోని ఎడబాటులు,తడ బాటులు,మన అనుకున్న వారు దూరం ఐన సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట,ఆట, కాకుండాకుటుంబ సభ్యులు,బంధు,మిత్రులైన వారితో మన వల్లో,వారి వల్లో ఏర్పడినమానసిక దూరాన్ని తగ్గించు కుని,*అందరం కలిసే రోజుగా మనమే ముందుగా ఒక అడుగు వేసి దగ్గర చేసు కుందాం. ఆ సమయమే ఈ హోళీ.*అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతి అందం. అందరిని కలుపు కుంటేనే *మనసుకి అందం*అన్ని ఆలోచనలను పరిగణించిచక్కని దారిన కలిసి నడిస్తేనే *మనిషికి అందం.* హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు.*ఇంకెందుకాలశ్యం మాట జారిన వారిపై ముందుగా రంగులు జల్లేద్దాం.* మనమే వారికి ఒక ఫోన్ చేద్దాం.దూరం పెట్టిన వారిని దగ్గరగా చేర్చుకుందాం.ఇదే కృష్ణ తత్వ రహస్యం.మీకు మీ కుటుంబ సభ్యులకు ముందస్తు హోళి శుభాకాంక్షలు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో