YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ స్థానంలో నాని ఖరారైనట్టే 

Highlights

  • ఇక బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్‌కు నాని హోస్ట్ 
ఎన్టీఆర్ స్థానంలో నాని ఖరారైనట్టే 

నేచురల్ స్టార్ నాని ది బెస్ట్ ‘బిగ్ బాస్ 2' హెూస్ట్ చేయడాని బెస్ట్ ఆప్షన్‌గా నాని అనే నిర్ణయానికి వచ్చి నిర్వాహకులు అతడిని సంప్రదించడం, పలు చర్చల అనంతరం నాని కూడా చేయడానికి ఓకే చెప్పడం జరిగిపోయిందట.ఈ మేరకు ఆయన షో నిర్వాహకుల నుండి ఇప్పటికే భారీ పారితోషికంతో కూడిన అడ్వాన్స్ చెక్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నాని తెలుగు బిగ్ బాస్ 2 ప్రోమో విడుదల చేయబోతున్నారని సమాచారం. తొలి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలతో బిజీగా ఉండే ఆయన ‘బిగ్ బాస్ 2' రెండో సీజన్ హోస్టింగ్ అవకాశాన్ని వదులుకోకతప్పలేదట. ఆయన రెండో సీజన్ హోస్ట్ చేయలేని స్థితిలో ఉండటంతో ఆ స్థానాన్ని నానితో రీప్లేస్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు.

నాని టాలెంట్, అతడి స్టార్ ఇమేజ్ బిగ్ బాస్ 2 కార్యక్రమానికి మరింత వన్నె తెస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా  ఎన్టీఆర్ కి ఇచ్చిన  రూ.35 లక్షలకు  ఏ మాత్రం తగ్గకుండా ఇవ్వాలని బిగ్ బాస్ 2 నిర్వాహకులు డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా గతేడాది జులై 16న బిగ్ బాస్ తొలి సీజన్ ప్రారంభం అయింది. సెప్టెంబర్ 24న గ్రాండ్ ఫినాలెతో ముగిసింది. 

 

Related Posts