YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*సంతృప్తి* 

*సంతృప్తి* 

*సంతృప్తి* 
సంతోషమయ జీవనానికి సంతృప్తి తప్పనిసరిగా కావాలి . ఎంతటి ఐశ్వర్యమున్నా సంతృప్తి లేని మనిషికి సంతోషం ఉండదన్న విషయం సర్వవిదితం . సుఖ సంతోషాలను అందించే వస్తువులను కోరుకునే వ్యక్తి వాటిని పొందటానికి కష్టపడి పనిచేయాలి . కష్టంలో సంతోషం లభించదు కదా ! ఆలా కష్టపడి పొందిన వస్తువులను కాపాడుకోవటానికి మళ్ళీ కష్టపడాలి . అప్పుడూ సంతోషం ఉండదు . ఒకవేళ ఎదో ఒక కారణంగా కష్టపడి సంపాదించిన ఆ వస్తువులను పోగొట్టుకుంటే ఉన్నదనుకున్న సంతోషం పూర్తిగా నశించి , దుఃఖమే మిగులుతుంది .
అందువలన ఏదో సంపాదించాలనే కోరికను కలిగి ఉండటం మనకు మంచిది కాదు . ప్రాచీన కాలంలో వనాలలో నివసించే ఋషులకు ఆస్తిపాస్తులు ఏమి ఉండేవి కాదు . అయినా వారు ఆనందంగా ఉండలేదా ? వారి ఆనందానికి ముఖ్య కారణం వారికున్న సంతృప్తియే .
పురాణాలలో పరమశివుడు జీవితమంతా విభూతిని పూసుకుని , పులి చర్మాన్ని ధరించి వృషభ వాహనంపై యున్నట్లు వర్ణించారు . విషయ వ్యామోహం పనికి రాదనటానికే సాంకేతికంగా యిలా చెప్పబడింది . మనం ఎంతటి ధనవంతులైన నిరాడంబరమైన జీవితాన్నే గడపాలి . అప్పుడే ఆనందంగా ఉండగలం .ధనం అనుకోకుండా మనకు లభిస్తే మంచి పనులు చేయటానికి , ధార్మిక కార్యక్రమాలు ఆచరించటానికి ఆ ధనాన్ని ఉపయోగించాలి .
ఈ ప్రపంచంలో ధనవంతులెవరు ? పేదవారెవరు ? అని అంటే , ఎవరి హృదయం సంతృప్తితో నిండి ఉందొ , ఎవరికి ఎటువంటి కోరికలు లేవో వారే ధనవంతులు , ఎవరికి ఈ లక్షణాలు ఉండవో వారు పేదవారు .
" వాహమిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలై :
సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః !
స హి భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కో ధనీ కో దరిద్ర : !! "
అందువలన సంతృప్తి అనే ఆదర్శాన్ని మనం ఆచరిస్తూ ఆనందమయ జీవనాన్ని గడపటానికి ప్రయత్నించాలి .
-జగద్గురు శ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామివారు .

Related Posts