కర్ణాటకలో జరుగునున్నఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రూపాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నుంచి 1,32,07,720 ల విలువైన సొత్తును ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది. ఆదివారం ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ బృందాలు, స్టాటిక్ నిఘా విభాగాలు మూకుమ్మడిగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో రూ. 1,12,90,720 నగదు, 18.9 లీటర్ల మద్యం, 18 చీరలు, రూ.19,17,000 విలువగల 2.464 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Election Commission's flying squads & static surveillance teams have seized Rs. 1,12,90,720 cash, 18.9 liters of liquor, 18 sarees & 2.464 Kg Gold worth Rs. 19,17,000: Chief Electoral Officer. #KarnatakaElection2018
— ANI (@ANI) April 1, 2018