YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 ఆపరేషన్ ఆకర్ష్  కు తెర తీసిన స్టాలిన్

 ఆపరేషన్ ఆకర్ష్  కు తెర తీసిన స్టాలిన్

 ఆపరేషన్ ఆకర్ష్  కు తెర తీసిన స్టాలిన్
చెన్నై, మార్చి 9
డీఎంకే అధినేత స్టాలిన్ అన్ని రకాలుగా స్ట్రాంగ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతల కంటే ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలమైన నేతలపైనే స్టాలిన్ గురిపెట్టారు. వారిని చేర్చుకోవడం ద్వారా డీఎంకే బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కొంతవరకూ పార్టీకి బలం చేకూర్చినప్పటికీ అదే సమయంలో డీఎంకేలో అసంతృప్తులు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు. రేపు టిక్కెట్ల పంపిణీ సందర్భంగా ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.తమిళనాడు శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అందుకోసం అన్ని అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న స్టాలిన్ మరింత దూకుడుతో వెళుతున్నారు. అన్నాడీఎంకేలో బలమైన నేతలను తన వైపునకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు డీఎంకేలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిినట్లు తెలిసింది.అన్నాడీఎంకు చెందిన సీనియర్ నేతలు సెంధిల్ బాలాజీ, ఆర్ ఎస్ రాజకన్నప్పన్ లకు ఇప్పటికే స్టాలిన్ డీఎంకే కండువా కప్పేశారు. వీరికి పార్టీలో ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. వీరికంటే ముందు డీఎంకేలో చేరిన అన్నాడీఎంకే నేతుల సెల్వగణపలి, ముత్తుస్వామి, రఘుపతిలకు కూడా పార్టీలో కీలకపదవులు అప్పగించారు. ఎమ్జీఆర్ హయాం నుంచి అన్నాడీఎంకేలో కీలక నేతలుగా ఉన్న శేఖర్ బాబు, రామచంద్రన్ వంటి నేతలను కూడా స్టాలిన్ పార్టీలో చేర్చుకుని తమకు ఏ పార్టీ వారైనా పరవాలేదని, సముచత స్థానం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చారు.అయితే ఇదే ఇప్పుడు స్టాలిన్ కు ఇబ్బందిగా మారిందంటున్నారు. కరుణానిధి హయాం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారిని కాదని, కొత్త వారికి ఎలా పదవులు కట్టబెడతారన్న ప్రశ్న సహజంగానే డీఎంకేలో ఉత్పన్నమవుతోంది. కొందరు సీనియర్ నేతలు స్టాలిన్ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. యువకులకే ప్రాధాన్యత ఇవ్వాలన్న స్టాలిన్ ఆలోచనల పట్ల కూడా సీనియర్లు అభ్యంతరం చెబుతున్నారు. మరి కొత్తగా వచ్చే నేతల చేరికతో డీఎంకేలో అసంతృప్తి తలెత్తే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మొత్తం మీద స్టాలిన్ నిర్ణయాలు పార్టీని బలోపేతం చేయడానికైనా, సొంత పార్టీ నేతలకు మాత్రం మింగుడు పడటం లేదు.

Related Posts