YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా దేశీయం

హాట్ టాపిక్ గా మారిన రజనీ టాపిక్

హాట్ టాపిక్ గా మారిన రజనీ టాపిక్

 హాట్ టాపిక్ గా మారిన రజనీ టాపిక్
చెన్నై, మార్చి 9
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. అయితే ఆయన ఒక విషయంలో మాత్రం సంతృప్తికరంగా లేరని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతానని అన్నారు. తాను మోసపోయానని అంటున్నారు. ఇప్పుడు ఇదే తమిళనాట హాట్ టాపిక్ అయింది. రజనీకాంత్ ను మోసం చేసిందెవరు? ఆయనలో అసంతృప్తి తలెత్తడానికి కారణమేంటి? రాజకీయాల పరంగానా? సినిమాల పరంగానా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగుతోంది. రజనీకాంత్ సహజంగా మృదు స్వభావి. ఆయనకు మొన్నటి వరకూ రాజకీయాలతో సంబంధం లేదు. తమిళుల ఆరాధ్య దైవంగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఎంజీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది రజనీకాంత్ మాత్రమే. కేవలం తమిళనాడు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ కు వీరాభిమానులున్నారు.అయితే రజనీకాంత్ వ్యాఖ్యలపై ఎవరి అర్థాలు వారు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రజనీ అభిమానులు తమ బాస్ ను బాధ పెట్టిన అంశం ఏంటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించగానే అభిమానులందరూ పండగ చేసుకున్నారు. అయితే తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు రజనీకాంత్ తమిళుడు కాదన్న నినాదాన్ని తెచ్చారు. ఇతర రాష్ట్రాల నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే హక్కు లేదని కూడా కొందరు కఠినంగా వ్యాఖ్యానించారు. ఇందులో శరత్ కుమార్ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. ఇదే అంశం ఆయనను బాధించి ఉండవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.ఇక రాజకీయ పార్టీల్లో కూడా చర్చనీయాంశమైంది. బీజేపీకి రజనీకాంత్ కు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం కూడా రజనీకాంత్ ను బాధించదనే వారు కూడా లేకపోలేదు. అయితే రజనీ ఈ విషయాన్ని లైట్ గానే తీసుకుంటారంటున్నారు. కాకుంటే తాను నియమించిన తన అభిమానులే మోసం చేశారని కూడా రజనీ బాధపడి ఉండవచ్చంటున్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఇందులో రజనీకాంత్ నియమించిన కార్యదర్శులపై ఆరోపణలు రావడం రజనీకాంత్ ను ఇబ్బంది పెట్టాయంటున్నారు. మొత్తం మీద రజనీకాంత్ వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమయ్యాయి.

Related Posts